25.01.2023 బుధవారం,
ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీపీఐ- ఏఐటియూసి సంయుక్తంగా నిరసన దీక్ష కార్యక్రమం జరిగినది
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఏకైక అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉక్కు పరిశ్రమని,
ఈపరిశ్రమను ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ మౌనంగా కూర్చుందని విమర్శించారు.
విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత నిధులు గనుల కేటాయించి పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు..
ఏఐటియూసి రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులు చలసాని రామారావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభమై రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన దీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు.
భవిష్యత్తులో రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేంతవరకు ఈ పోరాటం కొనసాగుతుందని ఈ పోరాటంలో ఉద్యోగులు కార్మికులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పిలుపునిచ్చారు.
ఏఐటియూసి జిల్లా కన్వీనర్ బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేస్తుంటే మౌనంగా ఉందని తక్షణమే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగేలాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యక్ష పోరాటాలు చేయాలని ఎన్నో త్యాగాలతో ఆత్మ బలిదానాలతో ఏర్పాటైన ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు కర్మాగారం ఈ కర్మాగారాన్ని రక్షించుకోవడానికి ప్రభుత్వ రంగంలో కొనసాగేలా చూడడానికి సిపిఐటియుసి ఎల్లప్పుడూ పోరాడుతుందని ఆ పోరాటంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని ఉద్యోగ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొవాలని పిలుపునిచ్చారు.