ఏలూరు ఫిబ్రవరి 2:
ఈనెల 4,5 తేదీలలో ఏలూరులో జరిగే హేలాపురి బాలోత్సవం మూడవ పిల్లల సంబరాలు నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని హేలాపురి బాలోత్సవం ఆహ్వాన సంఘం నాయకులు గుడిపాటి నరసింహారావు, అడుసుమిల్లి నిర్మల చెప్పారు. ఏలూరులోని పవర్ పేటలో అన్నే భవనం వద్ద హేలాపురి బాలోత్సవం మూడవ పిల్లల సంబరాలు నిర్వహణ జరుగుతున్న ఏర్పాట్లను ఆహ్వాన సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా గుడిపాటి నరసింహారావు,అడుసుమిల్లి నిర్మల మాట్లాడుతూ బాలోత్సవ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. అనేకమంది టీచర్లు, విద్యార్థులు స్వచ్ఛందంగా వాలంటీర్లు వచ్చి ఏర్పాట్లు పూర్తి చేయడంలో భాగస్వామ్యం కావడం అభినందనీయమన్నారు. 60 రకాల కల్చరల్ మరియు అకాడమిక్ పోటీలలో 7400 మంది పైగా విద్యార్థులు పాల్గొనడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పోటీలలో పాల్గొనే విద్యార్థులు, ఉపాధ్యాయులు, అందరికీ ఉచితంగా భోజనం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఏలూరు నగరంలో పెద్ద ఎత్తున జరుగుతున్న హేలాపురి బాలోత్సవం మూడవ పిల్లల సంబరాలను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అమరావతి బాలోత్సవం నాయకులు యూ.వి.రామరాజు, హేలాపురి బాలోత్సవం ఆహ్వాన సంఘం నాయకులు పి కస్తూరి బాయి, ఏ సుందరీ, ఎన్ గంగా భవాని, ఏ మోహిని ఎం లక్ష్మి, ఎం పర్వీన్ మరియు ఎ అర్ డి జి కే విద్యార్థులు పాల్గొన్నారు.