APCINEMA

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ అన్‌ స్టాపబుల్‌ ఎపిసోడ్ స్ట్రీమింగ్‌ కి సిద్ధం

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ అన్‌ స్టాపబుల్‌ ఎపిసోడ్ స్ట్రీమింగ్‌ కి సిద్ధం అయ్యింది. ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు ముందే అన్‌ స్టాపబుల్‌ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌ ను స్ట్రీమింగ్‌ చేసేందుకు ఆహా సిద్ధం అయ్యింది. పవన్‌ కళ్యాణ్ కళ్యాణ్‌ ఎపిసోడ్ విషయంలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ప్రభాస్‌ ఎపిసోడ్‌ ను కూడా రెండు పార్ట్‌ లుగా స్ట్రీమింగ్‌ చేశారు. అంతే కాకుండా ఒక రోజు ముందుగానే స్ట్రీమింగ్‌ చేయడం జరిగింది. ప్రభాస్ ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ చేసిన సమయంలో ఒకే సారి అత్యధిక యూజర్స్ ఆహా ను లాగిన్‌ అవ్వడంతో యాప్ క్రాష్ అయ్యింది.

దాంతో కొన్ని గంటల పాటు ఆహా సేవలు నిలిచి పోయాయి. ఇప్పుడు పవన్ కళ్యాన్ ఎపిసోడ్‌ కు ఆ సమస్య రాకుండా ఉండేందుకు గాను ఆహా టీమ్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇక ప్రభాస్ మరియు పవన్ కళ్యాణ్ ల యొక్క అన్‌ స్టాపబుల్‌ ఎపిసోడ్స్ లో ఎవరి ఎపిసోడ్‌ కి ఎక్కువ వ్యూ మినిట్స్ వచ్చాయి అంటూ లెక్కలు వేసుకునేందుకు ఫ్యాన్స్ సిద్ధం అవుతున్నారు. ప్రభాస్ ఎపిసోడ్‌ లో గోపీచంద్‌ హాజరు అవ్వగా.. పవన్ కళ్యాన్ ఎపిసోడ్‌ లో సాయి ధరమ్‌ తేజ్ గెస్ట్‌ గా వచ్చి వెళ్లాడు. సినిమాల నుండి మొదలుకుని రాజకీయాల వరకు అన్ని విషయాలను కూడా పవన్ కళ్యాణ్ ఈ ఎపిసోడ్‌ లో చెప్పబోతున్నాడు. సీజన్‌ 2 యొక్క చివరి ఎపిసోడ్‌ కూడా పవన్‌ కళ్యాణ్‌ దే అనే వార్తలు వస్తున్నాయి.