xవిద్యార్థులకు పరీక్షల సమయం వచ్చేస్తోది. సాధారణంగా ఆ టైమ్ లోనే ఎప్పుడూ ఉపాధ్యాయులు ధర్నాలు, ఆందోళనలకు దిగుతుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు(Jagan Employees) ఎన్నికలు సమీపంలో ఆందోళన బాట పడతారు. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. ప్రభుత్వానికి ఈనెల 26వ తేదీ డెడ్ లైన్ పెట్టారు. ఆ రోజు లోపు సీపీఎస్ (CPS)రద్దు చేయకపోతే ఆందోళనకు కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. ఈనెల 24న యూటీఎఫ్ ఛలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపు ఇచ్చింది. ఉద్యోగుల సంఘాలు జేఏసీగా ఏర్పడి ఈనెల 26న సమావేశానికి సిద్ధమయ్యాయి. ఆ రోజున కార్యాచరణ ప్రారంభిస్తామని జేఏసీ బొప్పరాజు ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు.ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన (Jagan Employees) ప్రభుత్వ, ఉపాధ్యాయ సంఘాల్లో(Jagan Employees) నిలువునా చీలిక ఉంది. అయినప్పటికీ ఒక వర్గం ఆందోళనకు దిగుతోంది. అక్కడ కూడా సామాజికవర్గం పోరు మొదలయింది. ఉద్యోగ సంఘాల్లోని `రెడ్డి` సామాజికవర్గం సీఎం జగన్మోహన్ రెడ్డికి మద్ధతుగా ఉంటోంది. మిగిలిన సామాజికవర్గాల లీడర్లు విభిన్నంగా అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. వాస్తవంగా ఈనెల 3వ తేదీన సీపీఎస్(CPS) రద్దును కోరుతూ ధర్నా చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రయత్నం చేశాయి. కానీ, ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో నిమ్మకుండి పోయాయి. వాస్తవంగా మద్యం నిషేధం, సీపీఎస్ రద్దు(CPS) అంశాలను 2019 ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ప్రధాన అస్త్రాలుగా తీసుకున్నారు.
కానీ, ఆ విధంగా చేయడం ప్రభుత్వానికి మోయలేని భారంగా మారుతోంది. అదే విషయాన్ని తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి సీపీఎస్ మీద అవగాహన లేకపోవడంతో హామీ ఇచ్చినట్టు చెప్పారు. ఆ విషయాన్ని మీడియా ముఖంగా సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి బాహాటంగా చెప్పారు. ప్రత్యామ్నాయ మార్గాలను చూపారు. మంత్రివర్గ ఉపసంఘం సీపీఎస్ బదులుగా జీపీఎస్ ఇస్తామని చెప్పింది. అయినప్పటికీ ఉద్యోగులు అంగీకరించడంలేదు. దానిపై కోర్టుకు వెళ్లడానికి సిద్ధవుతామంటూ హెచ్చరించారు. ఉప సంఘంలోని కీలక మంత్రి బొత్సా ఒకానొక సందర్భంగా కోర్టు వెళ్లండని కూడా తెగేసి చెప్పారు. సీపీఎస్ రద్దు చేయలేమని స్పష్టం చేశారు. అయినప్పటికీ దానిపైనే ఉద్యోగులు పట్టుబడుతున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల లీడర్లను కొందర్ని ప్రభుత్వం సానుకూలంగా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ ప్రభుత్వమూ 100శాతం అమలు చేసిన దాఖలాలు చరిత్రలో లేవు. ఆ విషయం ఉద్యోగులకు(Jagan Employees) తెలియని అంశం కాదు. అయినప్పటికీ ఆందోళనకు కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించడాన్ని రాజకీయ కోణం నుంచి వైసీపీ చూస్తోంది. అందుకే, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల లీడర్లను కొందర్ని ప్రభుత్వం సానుకూలంగా మలచుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈనెల 26న డెడ్ లైన్ పెడుతూ యూటీఎఫ్ తో పాటు కొన్ని సంఘాల లీడర్లు ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని చేస్తోన్న ప్రయత్నం మీద ప్రభుత్వం సీరియస్ గా ఉంది. పరీక్షలకు ఏ మాత్రం ఆటంకం కలుగకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటోంది.