AP

ఎన్నికల బడ్జెట్‌, ఎస్సీలకు పెద్ద పీట, బీసీలకు నామమాత్రం

ఎన్నికల బడ్జెట్ ను తెలంగాణ ప్రభుత్వం( Telangana Budget) రూపకల్పన చేసింది. ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ను సోమవారం ప్రవేశపెట్టారు. సంక్షేమానికి పెద్ద పీట(Welfare) వేస్తూ ఎన్నికల దిశగా కేటాయింపులను చూపారు. గత ఏడాది కంటే అంచనాలను భారీగా పెంచుతూ వచ్చే ఆర్థిక ఏడాది(2023-2024)కి రూ. 2,90,396 కోట్ల బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల బడ్జెట్ ( Telangana Budget) 2023-2024 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం(Telangana Budget) భారీ బడ్జెట్ ను కేటాయించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 2,90,396 కోట్లతో బడ్జెట్ అంచనాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. దీనిలో రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు. మూల ధన వ్యయం రూ. 37,585 కోట్లుగా ఉంది. తెలంగాణ తలసరి ఆదాయం రూ. 3,17,215గా ఉందని హరీశ్ రావు ప్రకటించారు.బడ్జెట్లో వ్యవసాయానికి అత్యధికంగా రూ. 26,931 కోట్లను కేటాయించింది. నీటి పారుదల శాఖను రెండో ప్రాధాన్యంగా తీసుకుంటూ రూ. 26, 885 కోట్లు, విద్యుత్ కు రూ.12, 727 కోట్లు ఇచ్చింది. ఆసరా పెన్షన్ల కోసం రూ. 12 వేల కోట్లు, దళితబంధు కోసం రూ. 17,700 కోట్లు, ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ. 36, 750 కోట్లు, ఎస్టీ ప్రత్యేక నిధి కోసం 15, 233 కోట్లు కేటాయించింది. బీసీ సంక్షేమం కోసం రూ. 6229 కోట్లు, మహిళా, శిశు సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు కేటాయింపులు చేసింది. Also Read : Telangana Budget: అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న హరీశ్ రావు! కేటాయింపులను గమనిస్తే ఎస్సీ, ఎస్టీలను (Welfare) ఆకర్షించేలా కనిపిస్తోంది. ఇప్పటికే జనాభా ప్రాతిపదికన రిజర్వేష్లను ఉండాలని కేసీఆర్ ప్రభుత్వం చెబుతోంది. కానీ, ఆ దిశగా పగడ్బందీ అడుగులు మాత్రం వేయలేదు. ఈసారి బడ్జెట్లో మాత్రం ఎస్సీల కోసం ప్రత్యేక నిధి కింద రూ. 36, 750 కోట్లు కేటాయించడం హైలెట్ గా నిలుస్తోంది. మునుపెన్నడూ ఇంత పెద్ద మొత్తాన్ని ఎస్సీలకు కేటాయించిన సందర్భాలు లేవు. ఇది కాకుండా దళితబంధు కోసం రూ. 17, 700 కోట్లు కేటాయింపులను చూపారు.

అంటే ఎస్సీ ఓటు బ్యాంకు మీద కేసీఆర్ సర్కార్ కన్నేసింది. బీసీలకు బడ్జెట్లో పెద్దగా కేటాయింపులు కనిపించడంలేదు.. ఉద్యమ సమయంలో దళితులను సీఎం చేస్తానని కేసీఆర్ చెప్పారు. ఆ విషయాన్ని పలుమార్లు విపక్షాలు లేవనెత్తాయి. ఏదో ఒక రకంగా ఆ విషయాన్ని డైవర్ట్ చేస్తూ వచ్చిన కేసీఆర్ ఇప్పుడు దళితుల కోసం ప్రత్యేకంగా బడ్జెట్లో భారీ కేటాయింపు(Telangana Budget) చేయడం ఆ వర్గం ఓట్లను సానుకూలంగా మార్చుకోవడానికి సిద్దమయ్యారని తెలుస్తోంది. విచిత్రంగా బీసీలకు బడ్జెట్లో పెద్దగా కేటాయింపులు కనిపించడంలేదు. వాస్తవంగా దళిత బంధులాగా, బీసీలకు కూడా ప్రత్యేకంగా బీసీ బంధు కావాలని డిమాండ్ ఉంది. ఆ దిశగా ఈ బడ్జెట్లో కేసీఆర్ సర్కార్ ఆలోచన చేయలేదు. మహిళ, బీసీ సంక్షేమానికి పెద్దగా కేటాయింపులు జరగలేదు. బీసీ సంక్షేమం కోసం కేవలం రూ. 6,229 కోట్లను మాత్రమే కేటాయించారు. ఇక మహిళ, శిశు సంక్షేమం కోసం అత్యంత తక్కువగా రూ. 2,131 కోట్లను మాత్రమే కేటాయించడం గమనార్హం. పూర్తిగా ఎన్నికల దిశగా ఈబడ్జెట్ రూపకల్పన జరిగినట్టు కనిపిస్తోంది. వ్యవసాయం, నీటిపారుదలకు యథాలాపంగా కేటాయింపులు ఎక్కువగా జరిగినప్పటికీ దానిలో వాటా ఎక్కువగా భూమి ఉన్న వాళ్లకు వెళుతోంది. Also Read : Jagan-KCR : `తెలుగు బ్రదర్స్ `కు విభిన్నంగా కనిపిస్తోన్న కేంద్ర బడ్జెట్ సంక్షేమానికి (Welfare)పెద్ద పీట వేస్తూ రూపకల్పన చేసిన ఈ బడ్జెట్ పూర్తిగా ఎస్సీల బడ్జెట్ గా కనిపిస్తోంది. మిగిలిన వర్గాలను ఆకర్షించేలా ఎక్కడా కనిపించలేదు. పైగా అభివృద్ధికి సంబంధించిన కేటాయింపులు పెద్దగా లేవు. ఇక తలసరి ఆదాయాన్ని 3లక్షలా17వేల 215లుగా చూపడం తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బాగుందనే సంకేతం ఇచ్చారు. దేశంలోనే తెలంగాణ నెంబర్ 1గా ఉందని చెప్పుకోవడానికి ఈ తలసరి ఆదాయం కనిపిస్తోంది. కానీ, పేద, ధనిక వర్గాల మధ్య గ్యాప్ పెరిగిన విషయాన్ని ఎక్కడా బడ్జెట్లో ప్రస్తావించిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. అంతేకాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రైతుల మరణాల సంఖ్య 6వేలకు పైగా ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ల సంఖ్య సుమారు 900 మంది ఉంటే, రాష్ట్ర ఏర్పడిన తరువాత ఆత్మహత్యలు చేసుకున్న రైతుల సంఖ్య 6వేలకు పైగా ఉందని రికార్డ్ ల ద్వారా తెలుస్తోంది. ఈ పరిణామాన్ని చక్కదిద్దేలా బడ్జెట్ లేదని ఆర్థిక వేత్తల అభిప్రాయం.