AP

నాసిరకమైన భోజనం విద్యార్థులు ఎలా తిన్నాలి. – ఎస్ఎఫ్ఐ

పార్వతీపురం మన్యం జిల్లా

నాసిరకమైన భోజనం విద్యార్థులు ఎలా తిన్నాలి.
– ఎస్ఎఫ్ఐ
• ఆకలితో విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నిరసన దీక్ష
• రోజుల తరబడి భోజనం బాగులేకపోవడంతో మంగళవారం కంచాలు తిరగేసిన విద్యార్థులు
• అధికారుల హామీతో కార్యక్రమం ముగింపు

పార్వతీపురం స్థానిక బైపాస్ రోడ్డులో గల గిరిజన సంక్షేమ పోస్టు మెట్రిక్ కళాశాల బాలురు వసతీ గృహంలో మంగళవారం నాడు విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులు భోజనం బాగులేకపోవడంతో హాస్టల్లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం చేయకుండా నిరసన దీక్ష చేపట్టారు. డిడి రావాలని విద్యార్థులు పట్టుబట్టడంతో ఐటిడిఎ డిప్యూటీ డైరెక్టర్ సత్యనారాయణ వచ్చి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. ఇన్ని నెలల బట్టి హాస్టల్ సందర్శనకు ఎందుకు రాలేదని విద్యార్థులు డిడిని ప్రశ్నించారు. హాస్టల్ వార్డెన్ కృష్ణమోహనుకు పలు మార్లు హాస్టల్ సమస్యలు తెలియజేసినప్పటికి పరిష్కారం చేయకపోవడంతో ఈ కార్యక్రమానికి సిద్ధమైనామని ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు. కొద్ది సేపటి వరకు ఘర్షణ జరుతున్న చోటికి పట్టణ ఎస్ఐ పకృదిన్ వచ్చి విద్యార్థుల సమస్యలు చాలా తీవ్రమైనవని వెంటనే పరిష్కారం చేయాలని అధికారులకు తెలిపారు. అధికారులు ఇచ్చిన హామీతో విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకుల అంతటితో కార్యక్రమాని ముగించారు.
ఈ సందర్బంగా విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ 420 మంది విద్యార్థులకు రెండే మరుగుదొడ్లు ఉన్నాయని, దానివల్ల మలమూత్ర విసర్జనకు అరుబయటకు వెళ్తున్నారని, ప్రహరీ గోడ లేకపోవడంతో పందులు, పశువులు గద్దుల్లోకి వచ్చి నిద్రిస్తున్నాయని, ఇంత మంది విద్యార్థులకు ఒకే పైపు లైన్ ఉండడంతో స్థానం చేయడానికి చాలా ఇబ్బందిగా ఉన్నదని, దానివల్ల సకాలంలో కాలేజీలకు వెళ్లలేకపోతున్నారని తెలిపారు. ప్రతీ గదిలో 30 మంది విద్యార్థులకు ఒకే లైటు, రెండు ఫ్యాన్లు ఉన్నందున్న చదవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. తాగడానికి మంచినీరు లేక బయట నుండి నీరు తెచ్చుకుంటున్నారని, ఆర్వో ప్లాంట్ శిలావిగ్రహంలాగే మిగిలిందని అన్నారు. మెను సక్రమంగా అమలు లేదని, దానివల్ల ఆహారం రుచుకరంగా ఉండకపోవడంతో చెత్తబుట్టలో పేరుకుపోతుందని తెలిపారు. ఇన్ని రకాల సమస్యలతో కొట్టిమిట్టాడుతున్న విద్యార్థులు మరో నెల రోజుల్లో రాబోయే పబ్లిక్ పరీక్షలో ఎలా ఉత్తిర్ణత సాధిస్తారని ఎస్ఎఫ్ఐ నాయకులు అధికారులను ప్రశ్నించారు. ఇన్ని రకాల సమస్యలకు మూలం ఉన్నత అధికారుల పర్యవేక్షణ లోపమని భవిస్తూ, వెంటనే స్థానిక సమస్యలు పరిష్కారం చేయాలని లేకుంటే భవిష్యతులో పెద్ద ఎత్తున్న ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుకార్యదర్శులు డి. పండు, పి. రాజశేఖర్, జిల్లా సహాయ కార్యదర్శి కె. రాజు, ఉపాధ్యక్షులు కె. భాస్కర్ మరియు హాస్టల్ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.