ఆంధ్ర ఒడిషా సరిహద్దులలో నాటు సారా స్థావరాలపై మెరుపు దాడులు
724 లీటర్ల నాటు సారా 200కేజీల ఇప్ప పువ్వు స్వాధీనం తో పాటు 6100 లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసం మరియు ముగ్గురు అరెస్టు
పార్వతీపురం మన్యం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వి. విద్యా సాగర్ , స్పెషల్ ఎన్ఫోర్స్మెమెంట్ బ్యూరో అదనపు ఎస్పీ శ్రీ. దిలీప్ కిరణ్ వారి పర్యవేక్షణలో ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఆర్. సుధాకర్ మరియు ఒడిషా ఎక్సైజ్ సూపరిటెండెంట్ బెహరా ఆధ్వర్యంలో ఆంధ్ర యస్ఈబి పోలీసులు మరియు ఒడిశా ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా ఆంధ్ర ఒడిషా సరిహద్దు సమీపంలో ఒడిషా గ్రామలైన సందుబడి, సన సందుబడి మరియు శిఖబడిలో నాటు సారాసారా స్థావరాలపై దాడులు చేసి 724 లీటర్ల నాటు సారా, 200కేజీల ఇప్పపువ్వును సీజ్ చేసి, 6100 లీటర్ల నాటు సారా తయారు చేసే బెల్లం ఊటలు ధ్వoసం చేయడమైనది. అలాగే ముగ్గురుని అరెస్ట్ చేయడమైనది. ఒడిషా అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేయడమైనది.. ఈ దాడుల్లో పార్వతీపురం మన్యం జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్స్ ఎల్.ఉపేంద్ర, పీ.డి.ప్రసాద్, ఎస్సైలు జె.రాజశేఖర్, నాగభుషనరావు, స్పెషల్ పార్టీ సిబ్బంది, ఒడిషా ఎక్సైజ్ సిఐలు, యస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.