గన్నవరం సచివాలయం 3లో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగి చేసిన పాడు పని అతనికి మహిళలంతా కలిసి దేహ శుద్ధి చేసేలా చేసింది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఒక యువతికి తీరని వేదన మిగిల్చింది.
ఇంతకీ గన్నవరం సచివాలయ ఉద్యోగి ఏం చేశారంటే..
మర్మాంగం కోసి.. గుండె బయటకు తీసి, పొట్టచీల్చి సైకోలా.. క్రైం లవ్ స్టోరీలో షాకింగ్‌విషయాలు
తెల్లారితే పెళ్లి.. కానీ పెళ్లి రద్దు అని చెప్పిన వరుడి కుటుంబం
గన్నవరం సచివాలయం మూడు లో ఈడ్పుగంటి రాంబాబు గ్రామ వెల్ఫేర్ మరియు ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. అదే సచివాలయ పరిధిలో వాలంటీర్ గా పనిచేస్తున్న యువతకి ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం చొప్పరమెట్లకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 22వ తేదీన వారి పెళ్లి జరగాల్సి ఉండగా ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాటు చేసుకుంటున్న క్రమంలో తెల్లారితే పెళ్లి అనగా, పెళ్లి రద్దు చేసుకుంటున్నట్టు వరుడు కుటుంబం నుండి వారికి కబురు అందింది.
పెళ్లి చెడగొట్టిన సచివాలయ ఉద్యోగి
దీంతో వధువుతో పాటు కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఎందుకు వరుడు కుటుంబం పెళ్లి రద్దు చేసుకుంది అన్నది అర్ధం కాక తల బాదుకున్నారు. ఆపై వరుడి కుటుంబాన్ని ఆరా తీయడంతో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. పెళ్లికి ముందు రోజు రాత్రి పనిగట్టుకుని మరి వరుడు దగ్గరకు వెళ్లిన సచివాలయ ఉద్యోగి రాంబాబు తాను వధువు ప్రేమించుకుంటున్నామని, తమకు అడ్డు రావద్దని సదరు వరుడికి చెప్పి వచ్చాడు. దీంతో వరుడు పెళ్లి నో అనేశాడు. ఈ కారణంగానే వరుడి కుటుంబం వివాహాన్ని రద్దు చేసుకుంది.
చీపుర్లు, చెప్పులతో బాది పారేసిన మహిళలు
ఇక ఇదే విషయాన్ని వారు వధువు కుటుంబంతో చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయిన వధువు కుటుంబ సభ్యులు గ్రామ వెల్ఫేర్ మరియు ఎడ్యుకేషన్ అసిస్టెంట్ రాంబాబుని పట్టుకుని చెప్పులు, చీపుర్లతో దేహ శుద్ధి చేశారు. ఒక ఆడపిల్ల జీవితం నాశనం చెయ్యటానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా అంటూ బాది పారేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి అప్పగించారు. తమ కుమార్తె వివాహాన్ని చెడగొట్టిన రాంబాబు పై కఠిన చర్యలు తీసుకోవాలని వధువు కుటుంబ సభ్యులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.