AP

ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కి షాక్..

ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి పట్టభద్రులు షాక్ ఇచ్చారు. శాసన మండలిలో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ టీడీపీ స్పష్టమైన ఆధిక్యం కనబరించి విజయకేతనం ఎగురవేసింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించినా గ్రాడ్యుయేట్ స్థానాల్లో మాత్రం ఎదురుగాలి వీచింది. టీడీపీ అభ్యర్థులకు పట్టభద్రులు పట్టంగట్టారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ విజయం సాధించగా.. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు గెలుపుని సొంతం చేసుకున్నారు. అంతేకాదు పశ్చిమ రాయలసీమలో మాత్రం ఇరు పార్టీల అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది.. రెండో ప్రాధాన్యత ఓట్లతోనే ఎక్కువగా ఫలితాలు వెల్లడయ్యాయి.