చెన్నై సూపర్ కింగ్స్ ,ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఆసక్తికర మ్యాచ్ లో చెన్నై పైచేయి సాధించింది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ని రెండు సార్లు చిత్తు చేసింది.
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబయి 139 పరుగుల తక్కువ స్కోరుకే ఆలౌటైంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 140 పరుగు లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.
తక్కువ స్కోరు ముందుండటంతో చెన్నై సునాయాసంగా నెట్టుకొచ్చింది. చెన్నై ఆటగాళ్లలో రుతురాజ్ గైక్వాడ్ 30 పరుగులు, అజింక్యా రహానే 21, అంబటి రాయుడు 12 పరుగులు చేశారు. అయితే అప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ 120 పరుగులను దాటేసింది. కాన్వే 44 పరుగుల వద్ద అవుటయ్యాడు. శివమ్ దూబే సిక్సర్ కొట్టడంతో చెన్నై విజయాన్ని ఇక ఎవరూ ఆలేకపోయారు. మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే చెన్నై విజయం సాధించింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.ఓపెనర్లు కామెరూన్ గ్రీన్(6), ఇషాన్ కిషన్(7)లతో పాటు వన్ డౌన్ బ్యాటర్ రోహిత్ శర్మ(0)లు దారుణంగా విఫలమయ్యారు.14 పరుగులకే ముంబై మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. నెహల్ వధేరా(64; 51 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో రాణించగా సూర్యకుమార్ యాదవ్(26; 22 బంతుల్లో 3 ఫోర్లు), ట్రిస్టన్ స్టబ్స్(20; 20 బంతుల్లో 2 ఫోర్లు) సాధించారు.