AP

పులివెందులలో రైతుల డబ్బుతో రోడ్ల మరమ్మతులు..

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో అధికార పార్టీ పాలన వైఫల్యాలను ఎండగడుతూ ఆ పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు (Chandrababu)ఈసారి ఏకంగా వైసీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌(YS Jagan)ని టార్గెట్ చేస్తూ ఓ వార్తను తన సోషల్ మీడియా(Social media) అకౌంట్ ద్వారా ప్రజలకు షేర్ చేశారు.
విచిత్రం ఏమిటంటే రాష్ట్రాన్ని పాలిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన సొంత నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, మౌళిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారని చెప్పే ప్రయత్నం చేశారు చంద్రబాబు. ఇందులో భాగంగానే వైఎెస్ఆర్ జిల్లాలోని జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల(Pulivendula) నియోజకవర్గంలోని లంగాల-క్రిష్ణంగారపల్లెకు మధ్య ఉన్న రోడ్డు పూర్తిగా దెబ్బతింది. అయితే రోడ్డు మరమ్మతులు ప్రభుత్వం, పాలకులు చేపట్టకపోవడంతో స్థానిక ప్రజలు, రైతులు విరాళాలు వేసుకొని రోడ్డును బాగు చేసుకున్నారు. ఒక న్యూస్‌ పేపర్‌లో ఈవార్తపై కథనం రాయగా ఆ క్లిప్‌ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన చంద్రబాబు పులివెందుల ఎమ్మెల్యే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ఈవార్త అంకితం అంటూ సెటైర్ వేస్తూ ట్వీట్(Twee)చేశారు. సొంత డబ్బుతో రోడ్డు వేయించుకున్న రైతులు..
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని..ప్రభుత్వం కొత్త రోడ్లు వేయకపోగా..కనీసం మరమ్మతులు కూడా చేపట్టడం లేదనివ విపక్షాలు టీడీపీ , జనసేన పార్టీలో గత ఏడాది నుంచి వైసీపీ సర్కారను విమర్శిస్తున్నాయి. ప్రజలు కట్టే ట్యాక్స్‌ల మౌళిక సదుపాయాలకు ఖర్చు చేయడం లేదని జనసేన దీనిపై ప్రత్యేక ఉద్యమాన్ని కూడా చేపట్టింది.ఈక్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు సైతం వైసీపీ సర్కారుతో పాటు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ని విమర్శిస్తూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. అందులో జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్ఆర్ జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో రోడ్లు పూర్తిగా దెబ్బతినడంతో స్థానిక ప్రజలు తమ సొంత డబ్బుతో రోడ్లు వేయించుకున్నారు.