టమాటా ధరలు ఆల్ టైం రికార్డుకు చేరుకున్నాయి. టమాటా ధర ప్రస్తుతం రూ 200 నుంచి రూ 250 వరకు పలుకుతుంది. రిటైల్ ధరల్లో మరింత భగ్గుమంటోంది. ఏకండా రూ 300 నుంచి రూ 400 వరకు విక్రయిస్తున్నారు.
కాస్త తక్కువ నాణ్యత ఉన్న టమాటా అదే మార్కెట్ లో రూ 100-150గా ఉంది. పెట్రోల్ ధరల కంటే కిలో టమాటా ధర ఎక్కువగా ఉండటంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. మరి కొంత కాలంగా ఈ పరిస్థితి కొనసాగక తప్పేలా లేదు.
పెరుగుతున్న టమటా ధరలు
టమాటా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చండీగఢ్‌లో కిలో టమాటా ధరలు రూ.300 దాటాయి. అక్కడ పలు మార్కెట్లో ఏకంగా ఏకంగా రూ.300 నుంచి రూ.400 వరకు విక్రయిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ గతం లో ఎన్నడూ లేని విధంగా టమాటా ధరలు మండిపోతున్నాయి.
భారీ వర్షాలు పడటం వల్లే దిగుబడి దగ్గడంతో టమాటా ధరలు చాలా రాష్ట్రాల్లో పెరిగాయని కురగాయలు అమ్మేవాళ్లు చెబుతున్నారు. ప్రస్తుతం టమాటా ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటిని నిల్వ ఉంచుకునే వ్యాపారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 114 రైతు బజార్లలో సబ్సిడీ ధరలకు టమాటా విక్రయా కేంద్రాలను అందుబాటులోకి తీసుచొచ్చింది.
సామాన్యుల బెంబేలు
ఇప్పటికే రోజువారీ వినియోగించే టమాటా, పచ్చిమిర్చి ధరలు కొండెక్కగా.. ఇప్పుడు జీలకర్ర ధరలు అమాంతం పెరిగాయి. గతంలో కేజీ రూ.250 వరకు పలికిన జీరా.. ఇప్పుడు కేజీ రూ.1000 వరకు పలుకుతోంది. ఇటీవలి కాలంలో 300 శాతం ధర పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పచ్చిమిర్చి ధర కూడా దాదాపు రూ.150 వరకు ఉంది.
అలాగే అల్లం ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు మార్కెట్‌కు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఉత్తర ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ఎక్కువగా జీరా ఉత్పత్తి జరగాల్సి ఉన్నా గణనీయంగా తగ్గిపోయింది. దీంతో మరికొంత కాలం జీరా ధరలు ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.
వచ్చే వారం తగ్గే అవకాశం
టమాటా, పచ్చిమిర్చి, అల్లంతోపాటు, జీలకర్ర కూడా ఇప్పుడు వంటింట్లో కనిపించడం లేదు. ఇవి లేకుండానే వంటలకు సిద్ధమైపోతున్నారు సామాన్యులు. ఇక రెస్టారెంట్లలోనూ వీటి వాడకాన్ని తగ్గిస్తుండగా, కొన్నిచోట్ల ధరలు పెంచుతున్నారు. టమాటా తో సిద్దం చేసే డిష్ లను హోటల్స్ తమ మెనూ నుంచి తప్పిస్తున్నాయి.
అల్లం ధరలు క్రమేణా పెరుగుతున్నాయి. ఇక వీటితో పాటుగా ఉల్లి ధరలు పెరగటం ఖాయమనే ప్రచారం సామాన్యులను టెన్షన్ పెడుతోంది. నిత్యవసర ధరలు ఇలా ఒక్కొక్కటి పెరగటంతో ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాలను కోరుతున్నాయి. వచ్చే వారం టమాటా ధరలు కొంత మేర తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.