TELANGANA

అక్కడి నుండే పోటీ.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్లారిటీ!

తెలంగాణలో ఎన్నికల సమరం మోగనుంది.. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల బరిలో నిలిచే వారు ఒక్కొక్కరిగా క్లారిటీ ఇస్తూ ప్రజల్లోకి వస్తున్నారు.. ఇక తాజాగా తాను పోటీ చేసే స్థానంపై మాజీ ఐపీఎస్ అధికారి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ఈయన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నట్టు క్లారిటీ ఇచ్చేసారు.

తాజాగా కాగజ్నగర్ టౌన్ లోని బిఎస్పి కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయగా అక్కడ ఈయన మాట్లాడుతూ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.. ”సిర్పూర్ ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆయన అనుచరులు రాజ్యమేలుతున్నారని.. వీరి మద్దతుతో కాంట్రాక్టర్లు, దోపిడీదారులు రెచ్చిపోతున్నారు అని తెలంగాణ ఏర్పడిన కూడా సిర్పూర్ లో ఇంకా ఆంధ్ర పాలనే సాగుతుందని ఆయన చెప్పుకొచ్చారు.

సిర్పూర్ లోని పేపర్ మిల్లులో స్థానికులకు తక్కువ జీతాలు ఇస్తూ పక్క రాష్ట్రానికి చెందిన వారికీ ఎక్కువ చెల్లిస్తుంది అంటూ ఆరోపణలు చేసారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, దళితుల బంధు వంటి ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందకుండా చేస్తున్నారు అంటూ విమర్శించారు. అందుకే అక్కడి ఎమ్మెల్యే పాలనకు చరమగీతం పడాలని తాను సిర్పూర్ నుండి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.