AP

ఆధార్ వుంటేనే ప్రభుత్వ పథకాలు

ఏపీ వాసులకు అలెర్ట్. ఇకపై ఆధార్ వుంటేనే ప్రభుత్వ పథకాలకు వర్తిస్తుంది. ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు, రాయితీలు పొందాలంటే తమ ఆధార్‌ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
కేంద్రం ఒత్తిడి మేరకు ఏపీలో కూడా దీనిని అమలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం శాసనసభ సమావేశాలు లేనందున గవర్నర్‌ ఆమోదంతో ఆర్డినెన్స్‌ జారీ చేసినట్లు తెలిపారు.

ఈ ఆర్డినెన్స్‌ అమలులోకి వచ్చిన మూడు నెలల తర్వాత ఏయే పథకాలకు ఆధార్‌ తప్పనిసరో వివరిస్తూ జాబితాను ప్రకటిస్తామని తెలిపింది.