TELANGANA

సుమన్ టీవీ ఉద్యోగులకు బంఫర్ ఆఫర్-ఆరుగురికి బెంజ్ కార్లు, సీఈవోలుగా ప్రమోషన్!

ఏ సంస్థలో అయినా ఉద్యోగుల పాత్ర కీలకం. అయితే ఉద్యోగుల కష్టాన్ని గుర్తిస్తే ఆ సంస్థ మరెన్నో విజయాలు సాధిస్తుందని నమ్మిన సుమన్ టీవీ ఛైర్మన్ సుమన్ దూది..

ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుమన్ టీవీ 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా… ఆ సంస్థ ఎదుగుదలలో కీలక భూమిక పోషించిన 6గురిని వివిధ విభాగాలకు సీఈవోలుగా ప్రకటించింది యాజమాన్యం. అంతేకాదు వారికి నెలకు ఐదు లక్షల వేతనం, కోటి రూపాయల ఇన్సూరెన్స్ తో పాటు… బెంజ్ కార్లు గిఫ్ట్ గా ఇచ్చింది. గుజరాత్ వజ్రాల వ్యాపారి… తన సంస్థ ఉద్యోగులకు ఇళ్లు, కార్లు గిఫ్ట్ గా ఇచ్చారని విన్నాం. ఇప్పుడు ఓ తెలుగు వ్యక్తి… తన సంస్థ గ్రోత్ కు ఎంతో కష్టపడిన ఉద్యోగులకు గుర్తింపుగా సీఈవో ప్రమోషన్ తో పాటు బెంజ్ కార్లు గిఫ్ట్ గా ఇవ్వడం సంచలనం అవుతోంది.

8వ వార్షికోత్సవ వేడుకలు

సుమన్ టీవీ 8వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 5న హైదరాబాద్ లో ఎంతో వైభవంగా జరిగాయి. సుమన్ టీవీ 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరుగురు ఉద్యోగులకు బెంజ్ కార్లు బహుమతిగా అందించారు సుమన్ టీవీ ఛైర్మన్. తమ సంస్థలో కష్టపడి పని చేసే ఉద్యోగులకు గుర్తింపు ఉంటుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఆరుగురు ఉద్యోగులకు బెంజ్ కార్లు బహుమతిగా ఇవ్వడంతో పాటు… వారిని ఒక్కో విభాగానికి ఒక్కో సీఈఓగా నియమించారు. ఉమెన్ వింగ్ సీఈఓగా జయలక్ష్మి, బిజినెస్ సీఈఓగా నాగరాజు, న్యూస్ సీఈఓగా నిరుపమ, ఎంటర్టైన్మెంట్ విభాగానికి సీఈఓగా రోషన్, లైఫ్ స్టైల్ అండ్ భక్తి సీఈఓగా గీతాంజలి, హెల్త్ సీఈఓగా సుదర్శన్ ను నియమించినట్లు యాజమాన్యం ప్రకటించింది.