APCINEMATELANGANA

‘ప్రభాస్-మారుతీ’ సినిమా నుంచి ఫోటో లీక్..

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రాజెక్ట్ K, సలార్, మారుతీ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటూ గ్యాప్ లేకుండా ఉంటున్నాడు. ఒక సినిమా షెడ్యూల్ పూర్తి కాగానే మరో మూవీ షెడ్యూల్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

కాగా మారుతీ డైరెక్షన్‌ లో చేస్తున్న సినిమాకు ‘రాజా డీలక్స్‌’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారు. ఇక ఈ మూవీని పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్‌ చేస్తున్న విషయం తెలిసిందే. హారర్‌ టచ్‌ ఇస్తూ, మారుతీ మార్క్‌ ఫన్‌ కూడా ఉండేలా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ బ్యూటీ మాళవిక మోహన్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది.

అయితే గతంలో దర్శకుడు మారుతితో సినిమా సెట్స్‌లో ప్రభాస్ ఉన్న ఫోటో ఇదివరకు నెట్టింట లీకై తెగ వైరల్ అయ్యింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఫొటో లీక్ అయింది. ఇక ఈ ఫొటోలో ప్రభాస్, రిద్ది జంటగా కనిపిస్తున్నారు. ఇక ప్రభాస్ అయితే గుబురు గడ్డంతో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ లుక్స్ ని చూసిన రెబల్ అభిమానులు ఫిదా అవుతున్నారు.