AP

చంద్రబాబు బెయిల్ కోసం టీడీపీ నేతలు ప్రయత్నాలు

చంద్రబాబు బెయిల్ కోసం టీడీపీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజలు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ స్కాంలో నేరపూరిత కుట్రకు చంద్రబాబు పాల్పడ్డారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని న్యాయస్థానం వ్యాఖ్యానించారు.

చంద్రబాబు న్యాయవాదులు వర్తించదని వాదించిన 409 సెక్షన్ వర్తిస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. హౌస్ అరెస్ట్ గా పరిగణించాలని కోర్టు ను చంద్రబాబు కోరారు. అటు హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి.

చంద్రబాబు రెండు పిటీషన్లు:చంద్రబాబు అరెస్ట్ సమయం నుంచి 36 గంటల ఉత్కంఠ కొనసాగింది. ఈ ఉదయం ఏసీబీ కోర్టులో ప్రారంభమైన వాదనలు దాదాపు ఏడున్నార గంటలు కొనసాగింది. తీర్పు కోసం సమయం తీసుకున్న న్యాయమూర్తి అయిదు గంటల తరువాత వెలువరించారు. కోర్టులో జరిగిన వాదనల్లో అటు చంద్రబాబు తరపు న్యాయవాదులు పూర్తిగా సాంకేతికపరమైన అంశాలపైనే ఎక్కువగా వాదించారు.

చంద్రబాబు పై సీఐడీ నమోదు చేసిన 409 సెక్షన్ వర్తించదని వాదించారు. అదే సమయంలో ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఇదే కేసులో..ఈ సెక్షన్ పై గతంలో హైకోర్టులో జరిగిన వాదనలు..నిర్ణయాలను ప్రస్తావించారు. ప్రస్తత కేసులో తీర్పులో న్యాయమూర్ి 409 సెక్షన్ వర్తిస్తుందని స్పష్టం చేసారు.

సీఐడీ వాదనతో ఏకీభవిస్తూ:స్కిల్ స్కాంలో చంద్రబాబు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనే సీఐడీ వాదనలతో కోర్టు ఏకీభవించింది. దీంతో 14 రోజుల రిమాండ్ విధిస్తూతీర్పు ఇచ్చింది. వెంటనే చంద్రబాబు తరపు న్యాయవాదులు రెండు పిటీషన్లు దాఖలు చేసారు. అందులో ఒకటి గృహనిర్బంధంలో ఉంచేందుకు అనుమతించాలని పిటిషన్‌ కాగా, రెండోది ఇంటి భోజనం, మందులు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

ఇక, చంద్రబాబు అరెస్ట్ కు గవర్నర్ అనుమతి లేదంటూ ఈ రోజు జరిగిన వాదనల్లో చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. మాజీ ముఖ్యమంత్రి అనేది గౌరవ హోదా మాత్రమేనని…చంద్రబాబు ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారని వివరించారు. అరెస్ట్ ముందు స్పీకర్ కు సమాచారం ఇచ్చామని వెల్లడించారు. దీంతో, తీర్పు సమయంలో చంద్రబాబు తరపు న్యాయవాదుల అభిప్రాయం పరిగణలోకి తీసుకోలేదని నిర్ధారణ అయింది.