AP

ఏపీలో భారీ కుంభకోణం బయటపెట్టిన పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల పాటు పవన్ సమయం ఇచ్చారు. ఆ తరువాతే ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తానని చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే రెండేళ్ల తరువాత ప్రశ్నించడం ప్రారంభించారు. ఇటీవల స్వరం పెంచారు. ప్రభుత్వ విధానాలపై పోరాడుతుంటే.. సీఎం జగన్ తో పాటు వైసిపి నేతలు పవన్ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు.ఈ తరుణంలోజగన్ సర్కార్ అవినీతిని ఎండగట్టడమే ధ్యేయంగా పవన్ పని చేస్తున్నారు. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీకి సుదీర్ఘ లేఖ రాశారు.జగన్ సర్కార్ ఎలా అవినీతికి పాల్పడింది? ఆ పార్టీ నేతలు భాగస్తులు ఎలా అయ్యారు? వేల కోట్లు ఎలా కొల్లగొట్టారు అన్న సమగ్ర వివరాలను పొందుపరుస్తూ ప్రధాని మోదీకి ఫిర్యాదు చేయడం సంచలనం రేగుతోంది.

 

ముఖ్యంగా గృహ నిర్మాణం విషయంలో భారీ అవినీతి జరిగిందని ఆది నుంచి పవన్ ఆరోపిస్తూ వచ్చారు.. స్వయంగా జగనన్న కాలనీలకు వెళ్లి గృహ నిర్మాణాలను పరిశీలించారు. అందులో జరిగిన అవినీతిని ప్రస్తావించారు. ఇప్పుడు ఏకంగా ప్రధానికి ఫిర్యాదు చేయడం విశేషం. ఏపీలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని.. దీనిపై సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని పవన్ కోరుతున్నారు. ప్రధానికి ఐదు పేజీల లేఖలో ఈ విషయాలనే ప్రస్తావించారు.’ వైసిపి పాలనలో భూసేకరణ పేరిట రూ. 32,141 కోట్ల నిధులు దుర్వినియోగం చేశారు. ఇళ్ల పట్టాలు, నిర్మాణం పై ప్రభుత్వం భిన్న ప్రకటనలు చేస్తోంది. సిబిఐ వంటి సంస్థలతో దర్యాప్తు చేయిస్తే వాస్తవాలు తెలుస్తాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు భూసేకరణలో కీలకంగా వ్యవహరించారు. గతంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా పూర్తిగా లబ్ధిదారులకు ఇవ్వలేదు. 6.68 లక్షల టిడ్కో ఇల్లు పూర్తయితే 90 వేల మందికి మాత్రమే ఇచ్చారు. ప్రభుత్వం తీరుతో మిగతా లబ్ధిదారులు విసుగు చెందారు ‘ అని పవన్ తన లేఖలో పేర్కొన్నారు. మొత్తానికైతే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పవన్ రాసిన ఈ లేఖ పెను