AP

వైసీపీ మూడో జాబితా..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనడానికి సన్నద్ధమౌతోంది. ఇందులో భాగంగా రెండు విడతల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. మొత్తంగా 38 మంది కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించింది.

 

ఇందులో సామాజిక సాధికారత కల్పించారు వైఎస్ జగన్. మహిళలు, యువతకు పెద్ద పీట వేశారు. కొన్నిచోట్ల కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తగిన ప్రాధాన్యతను కల్పించారు. సామాజిక సాధికారతే ఆయుధంగా ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మలి జాబితాలో అన్ని కులాల వారికీ ప్రాతినిధ్యాన్ని ఇచ్చారు.

 

 

ఇక మూడో జాబితా కొద్దిసేపటి కిందటే విడుదలైంది. ఏడు లోక్‌సభ నియోజకవర్గాలకూ కొత్త అభ్యర్థులను ప్రకటించారు వైఎస్ జగన్. మంత్రి జోగి రమేష్‌కు స్థానచలనం కలిగింది. పెనమలూరు నుంచి ఆయన పోటీ చేయనున్నారు.

 

మొత్తం 21 మందితో కూడిన జాబితా ఇది. విజయనగరం లోక్‌సభ- చిన్న శ్రీను, ఏలూరు లోక్‌సభ- కారుమూరి సునీల్ కుమార్, విశాఖపట్నం లోక్‌సభ- బొత్స ఝాన్సీ, శ్రీకాకుళం లోక్‌సభ- పేరాడ తిలక్, విజయవాడ లోక్‌సభ- కేశినేని నాని, కర్నూలు లోక్‌సభ- మంత్రి గుమ్మనూరి జయరాం, తిరుపతి లోక్‌సభ- కోనేటి ఆదిమూలం ఇన్‌ఛార్జీలుగా నియమితులయ్యారు.

 

ఇచ్ఛాపురం- పిరియ విజయ, టెక్కలి- దువ్వాడ శ్రీనివాస్, చింతలపూడి (ఎస్సీ రిజర్వుడ్)- కంభం విజయ రాజు, రాయదుర్గం-మెట్టు గోవిందరెడ్డి, దర్శి- బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, పూతలపట్టు (ఎస్సీ)- ఎం సునీల్ కుమార్, చిత్తూరు- విజయానందరెడ్డి (ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్) ఇన్‌ఛార్జీలుగా నియమితులయ్యారు.

 

మదనపల్లి- నిస్సార్ అహ్మద్, రాజంపేట- ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి, కోడుమూరు- డాక్టర్ సతీష్, ఆలూరు- బూసినే విరూపాక్షి, కోడుమూరు (ఎస్సీ)- డాక్టర్ సతీష్, గూడూరు- మేరిగ మురళి, సత్యవేడు (ఎస్సీ)- డాక్టర్ మద్దిల గురుమూర్తి, పెనమలూరు- జోగి రమేష్, పెడన- ఉప్పాల రాము అపాయింట్ అయ్యారు.