AP

ఏపీ ఎన్నికల రాజకీయంలో కొత్త ట్విస్టులు..

ఏపీ ఎన్నికల రాజకీయంలో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ తిరిగి ఎన్డీఏలో చేరటం దాదాపు ఖాయమైంది. 2014 తరహా పొత్తులతోనే జగన్ ను ఓడించగలమని చంద్రబాబు, పవన్ భావిస్తున్నారు. బీజేపీ నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నాయి. అయితే, సీట్ల ఖరారు పైనే తుది నిర్ణయం ఆధారపడి ఉంది. ఈ సమయంలో పవన్ కు బీజేపీ బిగ్ టాస్క్ అప్పగించింది. చంద్రబాబు పై ఒత్తిడి పెరుగుతోంది. పొత్తుల్లో కీలక మలుపు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

 

ఎవరికెన్ని సీట్లు : ఏపీలో ఎన్నికల్లో పొత్తులు దాదాపు ఖాయం అయ్యాయి. ఈ సమయంలోనే సీట్ల పంపకాలు చంద్రబాబు పై ఒత్తిడి పెంచుతున్నాయి. అటు జనసేన శ్రేణుల నుంచి మెజార్టీ సీట్లు కేటాయించాలని పవన్ ను ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటి వరకు పొత్తులో భాగంగా జనసేనకు 25-27 అసెంబ్లీ, మూడు ఎంపీ స్థానాలు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ సంఖ్యతో జనసేన శ్రేణులు, పవన్ అభిమానులు సుముఖంగా లేరు. టీడీపీకి పూర్తిగా సహకరిస్తున్న తమకు కనీసం 40 స్థానాలు కావాలని పట్టు బడుతున్నాయి. దీంతో ఎవరూ పొత్తుల విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని పవన్ సూచించారు. ఈ సమయంలోనే బీజేపీతో పొత్తు ఖాయం దిశగా చర్చలు సాగుతున్నాయి. ఈ సమయంలో బీజేపీ నుంచి 25 అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలంటూ ప్రతిపాదన వచ్చింది.

 

కీలక మంత్రాంగం : చంద్రబాబు తన పార్టీ ముఖ్యులతో చర్చ తరువాత రెండు పార్టీలకు 40 అసెంబ్లీ – 9 ఎంపీ స్థానాలు ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి బీజేపీకి తమ ప్రతిపాదనలను పంపినట్లు విశ్వస నీయ సమాచారం. అటు బీజేపీ నేతలు పవన్ కు టాస్క్ అప్పగించారు. మిత్రపక్షాలుగా రెండు పార్టీలకు 50 స్థానాలు ఇచ్చేలా చంద్రబాబుతో చర్చించాలని సూచించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకున్న పవన్ కల్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం కానున్నారు. పొత్తులో సీట్ల ఖరారు వేళ చంద్రబాబు తన ముందు ఉన్న సమస్యలను ఇప్పటికే పవన్ తో చర్చించారు. 25 సీట్లకు మంచి పవన్ నుంచి ఆశించే అవకాశాలు లేవని తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు బీజేపీకి సర్దుబాటు పైనే ఇద్దరి నేతల మధ్య చర్చ జరగనుంది.

 

కార్యాచరణ ఖరారు : ఇక..ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ మూడు పార్టీల కామన్ అజెండా..మేనిఫెస్టో వంటి అంశాలు కీలకం కానున్నాయి. పవన్ కల్యాణ్ రెండు రోజుల్లో గోదావరి జిల్లాల్లో పర్యటన ఖాయమైంది. సీట్ల ప్రకటన కు ముందుగానే మూడు పార్టీల్లో ఎవరికి సీటు వచ్చినా మిగిలిన రెండు పార్టీల శ్రేణులు సహకరించేలా మార్గనిర్దేశం చేయనున్నారు. అయితే, సీట్ల కోసం రెండు పార్టీల నుంచి ఆశావాహుల సంఖ్య భారీగా ఉంది. ముందుగా సీట్ల దక్కని వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేసినా చివరి నిమిషం వరకు పవన్ -చంద్రబాబు పైన సీట్ల కోసం ఒత్తిడి ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో బీజేపీతో పొత్తు వేళ..ముందుగా రెండు పార్టీల్లో సీట్ల ఖరారు..మేనిఫెస్టో..ప్రచారం వంటి అంశాల పైన చంద్రబాబు – పవన్ కల్యాణ్ తుది