AP

టీడీపీ, జనసేన గెలుస్తాయా : వైసీపీని గెలిపిస్తాయా..!!

ఏపీలో ఎన్నికల సమీరణాలు మారుతున్నాయి. వచ్చే ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. గోదావరి జిల్లాల్లో మెజార్టీ సీట్లు సాధించాలని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని సీట్ల పైన నిర్ణయానికి వచ్చాయి. టీడీపీ సీనియర్లు ఉన్న నియోజకవర్గాల్లో జనసేన తమ అభ్యర్దులను ప్రకటించటంతో వారు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో, ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాల్లోని కీలక నియోజకవర్గాల్లో ఆసక్తి కర పోరు కొనసాగుతోంది.

 

సీటు కోసం పోటీ : గోదావరి జిల్లాలో ఆసక్తి కర నియోజకవర్గం రాజానగరం. ఇక్కడ టీడీపీ, జనసేన పొత్తుతో గెలిచే సీటుగా ప్రచారంలో ఉంది. అయితే..ఇక్కడ సీటు విషయంలో రెండు పార్టీల మధ్య పోరు కొనసాగుతోంది. పవన్ కల్యాణ్ రాజానగరం నుంచి తన అభ్యర్దిని ఇక్కడ ఖరారు చేసారు. జనసేన అభ్యర్దిగా బత్తుల బలరామక్రిష్ణ పోటీకి సిద్దమయ్యారు. దీంతో, ఇక్కడ టీడీపీ సీటు ఆశిస్తున్న బొడ్డు వెంకట రమణ చౌదరి మద్దతు దారులు టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని అచ్చెన్నాయుడు సముదాయించారు. ఇప్పుడు బొడ్డు వెంకట రమణ చౌదరిని రాజమండ్రి పార్లమెంట్ కు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే..పొత్తుల్లో భాగంగా రాజమండ్రి పార్లమెంట్ స్థానం బీజేపీ కోరుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

 

బరిలో నిలిచేదెవరు : ఇక, రాజనగరంలో సామాజిక సమీకరణాలే అభ్యర్దుల గెలుపు ఓటమలును డిసైడ్ చేస్తాయి. నియోజకవర్గంలో మూడు మండలాల్లో వర్గాలు, పార్టీలు అధిపత్య లెక్కలు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ కాపు, యాదవ వర్గాలే డిసైడింగ్ ఫ్యాక్టర్. నియోజకవర్గంలోని సీతానగరం మండలంలో కమ్మ వర్గం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2019లో ఇక్కడ జనసేనకు 20 వేల ఓట్లు వచ్చాయి. వైసీపీ నుంచి పోటీ చేసిన జక్కంపూడి రాజా 90,680 ఓట్లు సాధించి 31,772 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక్కడ టీడీపీ నేత పెందుర్తి వెంకటేష్ కు బలమైన వర్గం ఉంది. ఈ సారి ఎన్నికల్లో ఆయన పోటీలో లేరు. టీడీపీ నుంచి బొడ్డు వెంకట రమణ చౌదరి, జనసేన నుంచి బత్తుల బలరామక్రిష్ణ పోటీ దారులుగా ఉన్నారు. వైసీపీ నుంచి తిరిగి జక్కంపూడి రాజా పోటీ చేస్తున్నారు.

 

ఓట్ల బదిలీనే కీలకం : ఈ నియోజకవర్గం ఎవరికి వచ్చినా రెండో పార్టీ సహకారం..సామాజిక వర్గాల మద్దతు గెలుపును డిసైడ్ చేయనుంది. ఇప్పుడు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి జనసేన పోటీ చేస్తుందని పవన్ చెప్పటం తో రాజానగరం నుంచి జనసేన, టీడీపీలో ఎవరు పోటీ చేస్తారనేది సందేహంగా మారుతోంది. దీంతో..పోటీ పైన రెండు పార్టీల్లో నిర్ణయంతో పాటుగా ఎన్నికల్లో కలిసి పని చేయటం..సహకారం.. ఓట్ల బదిలీ ఎవరిలో గెలుపుకైనా కీలకంగా మారనుంది. రెండు పార్టీల్లో ఎవరికి సీటు వచ్చినా రెండో పార్టీ నుంచి మద్దతు కష్టమనేది వైసీపీ నేతల వాదన. దీంతో, ఇప్పుడు అభ్యర్ది ఎంపిక పైన చంద్రబాబు, పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.