AP

నా గెలుపు చరిత్రలో నిలిచిపోవాలి.. ఆ బాధ్యత వర్మదే: పవన్ కళ్యాణ్..

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎన్డీయే కూటమి నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. కూటమి కోసం తన సీటును త్యాగం చేసిన వర్మను ఉన్నత స్థానంలో ఉండేలా చూసుకుంటానని హామీ ఇచ్చారు.

 

పిఠాపురంలో కూటమి నేతలతో పవన్ సమావేశమై.. పోలింగ్ ముగిసే వరకు క్షేత్రస్థాయిలో కలిపి పనిచేయాలని పిలుపునిచ్చారు. వర్మ త్యాగం గొప్పదని కొనియాడారు. ప్రస్తుతం అందరూ కలసి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

 

తాను రాష్ట్ర ప్రజలు కోసం త్యాగం చేశానిని పవన్ అన్నారు. చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు తెలుగు తమ్ముళ్లు పడ్డ తానని ఎంతగానో కలిచివేసిందన్నారు. ప్రస్తుతం ఉన్న అన్ని పార్టీల్లో టీడీపీ సమర్థవంతమైన పార్టీ అని అన్నారు. స్ట్రక్చర్ కలిగిన పార్టీని నడపడం అంత సువులు కాదన్నారు.

 

ప్రస్తుతం జనసేన దగ్గర స్ట్రక్చర్ లేదని.. కాని బలం ఉందన్నారు. టీడీపీ దగ్గర ఉన్న స్ట్రక్చర్, జనసేన దగ్గర ఉన్న బలం కలిసి ఎన్నికలకు వెళ్తే రష్ట్రాన్ని కాపాడుకోగలం అని వెల్లడించారు. వైసీపీ పాలనను అంతం చేయడనాకి పొత్తు పెట్టుకున్నామని మరో సారి తెలిపారు.

 

తన కోసం పిఠాపురం సీటును త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే వర్మను పవన్ మరోసారి గుర్తిచేసుకున్నారు. వర్మ సీటును జనసేన కోసం వదులు కోవడం శుభ పరిణామం అని పేర్కొన్నారు. చంద్రబాబు మాట మేరకు వర్మ తన సీటును జనసేనకు కేటాయించారన్నారు.

 

ఒంటరిగా పోరాడి గెలిచే దమ్మున్న నాయుకుడు వర్మ అని పవన్ కొనియాడారు. కానీ అలాంటి వర్మ రాష్ట్రం బాగుపడాలనే మంచి ఉద్దేశంతో తన సీటును త్యాగం చేయడం చాలా గొప్ప విషయం అన్నారు. తాను అధికారంలో వస్తే కూటమి హక్కులకు, రాజకీయ మనుగడకు ఇబ్బంది లేకుండా పనిచేస్తానని పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు.

 

ప్రస్తుతం సీట్లు సర్దుబాటు విషయంలో జనసేన, టీడీపీ మధ్య ఏమైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం సర్దుకుపోవాలని సుచించారు. పిఠాపురంలో తన గెలుపు చరిత్రలో నిలిచిపోలన్నారు. ఆ బాధ్యతలను వర్మకే అప్పగిస్తున్నట్లు పవన్ తెలిపారు.