AP

వైకాపాలనలోనే వైద్య రంగానికి పెద్దపీట

వైకాపాలనలోనే వైద్య రంగానికి పెద్దపీట

* వైయస్సార్ ఆశయాలను కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్

* 104 వాహనం ప్రారంభంలో కొత్తవారిపల్లి సర్పంచ్ మహేష్..

కె. ఈశ్వర్ – ప్రత్యేక ప్రతినిధి

అన్నమయ్య జిల్లా

వైద్య రంగానికి పెద్ద పీట వేసిన ఘనత అప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డికి సాధ్యమైందని,నేడు ఆయన తనయుడుసీఎం జగన్ మోహన్ రెడ్డి తండ్రి కలలను నెరవేర్చేలా కృషి చేస్తున్నారని కొత్తవారిపల్లి సర్పంచ్ పి.మహేష్ బాబు అన్నారు. కొత్తవారిపల్లి పంచాయతీలో శనివారం ఆయన 104 సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మహేష్ బాబు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం రాకముందు పల్లె ప్రాంతపు ప్రజలు వైద్య సదుపాయం సరిగా లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే వారన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 104, 108 సేవలను తీసుకొచ్చి ప్రజలకు ఎంతో ఉపయోగపడేలా సేవలు అందించారన్నారు. అనంతరం వచ్చిన టిడిపి ప్రభుత్వం ఈ పథకాలను తుంగలో తొక్కిందని ఎద్దేవా చేశారు. 2019లో తిరిగి ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేజిక్కించుకుని వైద్య రంగానికి తిరిగి పెద్దపీట వేసారని కొనియాడారు, ప్రజలు ఈ అవకాశాన్ని తప్పనిసరిగా సద్వినియోగం పరుచుకోవాలన్నారు. గతంలో ఎప్పుడైనా అనారోగ్యానికి గురైతే చికిత్స కోసం మదనపల్లికి వెళ్లాల్సి వచ్చేదన్నారు. ఇప్పుడు ఆ అవసరం లేకుండా 104 సేవల ద్వారా గ్రామాలకే వైద్య సదుపాయం అందేలా ముఖ్యమంత్రి జగన్ చొరవ చూపారని కొనియాడారు. ఈ సేవలతో పాటూ దీర్ఘకాలిక రోగాలను సైతం మందులు అందుబాటులో ఉంటాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మహేష్ తో పాటు ఎంపీటీసీ రెడ్డి రాణి, డాక్టర్ సునీత, ఎ.యన్.యమ్ రజిని, వార్డ్ మెంబర్లు, సురేష్, జ్యోతి, శ్యాంమూర్తి, రమేష్ బాబు,రామ్మూర్తి, వైస్సార్సీపీ కార్యకర్తలు గ్రామప్రజలు పాల్గొన్నారు.