AP

ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలి సాగు భూములకు పట్టాలివ్వాలి

 

పార్వతీపురం మన్యం జిల్లా : గిరిజనల భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం(అయార్ల) జిల్లా కార్యదర్శి పి .సంఘం కోరారు. ఈ మేరకు శుక్రవారం పార్వతీపురం మండలం, పెదమరికి పంచాయితి , శివం దొరవలస, చినమరికి గ్రామాలకు చెందిన పలువురు గిరిజనులుతో ఆయన స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు . అనంతరం తహశీల్దార్ శివన్నారాయన కు వినతిపత్రం అందజేసి సమస్యను వివరించారు. పట్టణానికి చెందిన మాజీ సైనికడు కి ప్రభుత్వం వారు నిబంధనల ప్రకారం కొంత భూమిని కేటాయించాగా .. సదరు ఆ వ్యక్తి ఆభూమితో పాటు  మరికొంత భూమిని గతంలో ఆక్రమించుకొని గిరిజనులు వేసిన కంది మొక్కలను తన మనుషులతో పీకి వేశారని, ఈ విషయాన్ని జిల్లా ఉన్నత అధికారులకు, ప్రజా ప్రతినిధులకు పలుమార్లు తెలియజేయడం జరిగిందని గుర్తు చేశారు. అయినా నేటికీ ఆయన పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. కావున తమరు స్పందించి సుమారు 34 మంది గిరిజనలు సాగుచేసుకుంటున్న భూమిని గిరిజనులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మెళ్లికి. చిన్నారావు, కొండ గొర్రి. శశిరేఖ, నామాల. గంగ, పి. గౌరమ్మ , పి. గంగమ్మ, నీలమ్మ, రాణి ,భారతీ, ప్రమీల , తదితరులు పాల్గొన్నారు