ఏలూరు జిల్లా : చింతలపూడి నియోజకవర్గ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం(B) చింతలపూడి వసతి భవనం సరిపోక రాత్రిపూట ఆరు బయట నిద్రపోతున్న విద్యార్థులు౼ ఏలూరు పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పెనుబోయిన మహేష్ రాష్ట్ర టిఎన్ఎస్ఎఫ్ అదేశాలు మేరకు ఏలూరు పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పెనుబోయిన మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో తెలుగు విద్యార్థి సంక్షేమ హాస్టల్ పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు చింతలపూడి నియోజవర్గంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం (B) చింతలపూడిలో పరిశీలనకు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా పెనుబోయిన మహేష్ యాదవ్ మాట్లాడుతూ *గురుకుల పాఠశాలలో 600 మంది విద్యార్థులు ఉండగా కేవలం 10 బాత్రూములు ఉన్నాయని. *త్రాగడానికి సరైన మంచి నీరు కూడా లేదని బట్టలు ఉతుక్కోవడానికి అన్నం తిన్న తర్వాత చేతులు కడుక్కోవడానికి త్రాగడానికి ఒకటే నీరు ఉపయోగిస్తున్నారు. *పడుకోవడానికి బిల్డింగ్ సరిపోక తరగతి గదుల్లోనూ ఆరుబయట పడుకోవాల్సి వస్తుందని, పడుకునే దగ్గరే భోజనం కూడా చేయాల్సి వస్తుందని పిల్లలు తెలిపారు. *ఏదైతే సగం నిర్మాణంలో ఉన్నటువంటి భవనాన్ని పూర్తిచేసి త్వరితగతిన పిల్లలకు మంచి వసతులు ఏర్పాటు చేయాలని తరఫున డిమాండ్ చేస్తున్నాం. *మెస్ చార్జీలు పెంచాలని అలాగే కాస్మోటిక్ చార్జెస్ అందించాలని డిమాండ్ చేస్తున్నాం. *విద్యార్థులకు సన్నబియ్యం అందించాలి. ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు తాటి మణింద్రసింహ, జిల్లా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి మణికంఠ, చింతలపూడి పట్టణ అధ్యక్షులు పల్లె మున్న తదితర నాయకులు పాల్గొన్నారు..