రాజకీయ బద్ధ శత్రువులు చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా ఒక చోట కనిపించ బోతున్నారు. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు ఇద్దరు సోమవారం హస్తిన ప్రయాణం కడుతున్నారు. ఆ వేదికపై ఎవరి పెరఫార్మెన్సు ఎలా ఉండనుందో ఆసక్తిగా ఉంది. ఒకే సమావేశం ఒకటే ఎజెండా గా సాగే మీటింగ్లో జీ 20కి పనికి వచ్చే పాయింట్స్ మెరుగ్గా ఎవరు ఇస్తారు? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. బీజేపీతో పొత్తులకు కూడా బాబు తెరతీయడం ద్వారా వైసీపీకి గట్టి రిటార్ట్ ఇస్తారని వినికిడి. ఏపీలో 2014 నాటి పొత్తులను రిపీట్ చేయాలని చూస్తున్న చంద్రబాబు ఢిల్లీ మీటింగ్ ని అనువుగా ఉపయోగించుకోనున్నారని తెలుస్తుంది. జగన్ మీద గెలిచేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదు అన్నదే చంద్రబాబు వ్యూహమ్.గతంలో ఆజాదీ కా అమృతోత్సవ్ కార్యక్రమం కోసం ఢిల్లీ వెళిన చంద్రబాబు మోడీతో చేతులు కలిపారు. సుదీర్ఘంగా కాలంగా ఏర్పడిన గ్యాప్ ని బాబు బాగా తగ్గించుకోగలిగారు.ఇపుడు మరో స్టెప్ ముందుకు వేసి ఏకంగా మోడీతో భేటీకే తెర తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఢిల్లీ టూర్ తో మొత్తం గేం ని చేంజ్ చేయాలని చంద్రబాబు చూస్తున్నారు.
ఈసారి కచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావడానికి బాబు అంతా సిద్ధం చేసుకున్నారని సమాచారం. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ఏర్పాటు చేసిన అఖిల పక్ష భేటీకి చంద్రబాబు, ఏపీ సీఎం జగన్ కూడా అటెండ్ అవుతున్నారు. ఈ టూర్ ఏపీలో రాజకీయ పరిణామాలు మొత్తం మారిపోతాయని అంటున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అటు ఏపీలో బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడంతో పాటు వైసీపీకి కోలుకోలేని దెబ్బ తీయాలి అన్నదె బాబు విధానంగా కనిపిస్తోంది. జగన్ ఎదురుగానే ఆయన చూస్తూండగానే మోడీతో తన రిలేషన్స్ ని పెంచుకుని హస్తిన వేదికగా దెబ్బ తీసేందుకు వ్యూహం రచిస్తున్నారు. ఇక జగన్ మోడీతో భేటీ కి హాజరవుతారు. ఆ వెంటనే ఆయన తిరిగి వచ్చి కడప జిల్లా టూర్ కి వెళ్తారు. జగన్ ఢిల్లీని వీడి వచ్చినా కూడా బాబు ఎత్తుగడలను పరిశీలిస్తారు. బాబు రాజకీయాన్ని చూసి దాన్ని తిప్పి కొట్టే కౌంటర్ పాలిటిక్స్ కి జగన్ తెర తీస్తారని వైసీపీ వర్గాల్లోని టాక్. మొత్తానికి ఈ ఇద్దరు నేతలు ఢిల్లీ వేదికగా ఏ రకమైన రాజకీయాన్ని అనుసరిస్తారు అనేది ఆసక్తికరంగా ఉంది.