అహ్మదాబాద్ విమాన ప్రమాదం: డీఎన్ఏ టెస్టులు చేశాకే మృతులను ప్రకటిస్తామన్న అమిత్ షా..
అహ్మదాబాద్‌లో గురువారం చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన జరిగిన వెంటనే ఆయన అహ్మదాబాద్‌కు చేరుకుని, ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రులలో పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విచారాన్ని నింపిందని తెలిపారు. క్షతగాత్రులను పరామర్శించిన సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, “ఈ ఘటనతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది” అని తన ఆవేదనను వ్యక్తం చేశారు.…

