ఆంధ్రప్రదేశ్‌లో కళాకారులందరికీ ప్రత్యేక పింఛన్లు పునరుద్ధరణ – మంత్రి కందుల దుర్గేశ్ ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కళాకారులకు సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి కందుల దుర్గేశ్ శుభవార్త అందించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కళాకారులందరికీ ప్రత్యేక పింఛన్లను పునరుద్ధరించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇటీవల జరిగిన ఒక ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడుతూ, “కళాకారులు మన సంస్కృతికి ప్రతిబింబం, సమాజానికి ఆత్మ” అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కళాకారుల పింఛన్లను సాధారణ పింఛన్లలో విలీనం చేసి, వారి ప్రత్యేకతను తగ్గించిందని విమర్శించిన ఆయన, ప్రస్తుతం తమ ప్రభుత్వం కళాకారుల ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించడానికి కట్టుబడి ఉందని…

