Editor

National

నా వల్ల కూడా తప్పులు జరిగాయ్.. నేనూ మనిషినే, దేవుడిని కాదు..–: ప్రధాని మోడీ

జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. నిఖిల్ ఈ ఇంటర్వ్యూ ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. ఇందులో ప్రపంచంలోని యుద్ధ పరిస్థితులు, రాజకీయాల్లోకి యువత ప్రవేశం, మొదటి, రెండవ టర్మ్ పాలన మధ్య వ్యత్యాసంపై ప్రధాని మోడీ స్పందించారు. ఆ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మొదటి సారి పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూకి హాజరైనట్లు తెలిపారు.   ఈ సందర్భంగా నిఖిల్ కూడా నేను హిందీ…

AP

తిరుపతి మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల సాయం… కాంట్రాక్టు ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు..

తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందడం తెలిసిందే. నేడు తిరుపతి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై నిప్పులు చెరిగారు. ఘటన స్థలిని స్వయంగా పరిశీలించిన ఆయన, ఆసుపత్రిలో క్షతగాత్రులను ఓదార్చారు. ఈ ఘటనలో ఇద్దరు ఉన్నతాధికారులను సస్పెండ్ చేసిన చంద్రబాబు… మరో ముగ్గురు అధికారులపై బదిలీ వేటు వేశారు.   ఈ సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు… కీలక నిర్ణయాలు ప్రకటించారు. మృతుల…

AP

తిరుమల సాక్షిగా పవన్ సీరియస్ వార్నింగ్.. ఇకపై ఆ విధానం రద్దు..?

తిరుమలలో వీఐపీ సంస్కృతి కారణంగానే ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. టీటీడీ పాలక మండలి వీఐపీ ఫోకస్ వదిలి పెట్టి, సామాన్యులపై ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. తిరుపతిలోని వైకుంఠ ద్వారా దర్శనం టికెట్ల జారీ దగ్గర జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వారిని స్విమ్స్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. బాధితులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ప్రమాదం జరగడానికి కారణాలపై అధికారులతో చర్చించారు.   తిరుమలలో స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు మొదటి ప్రాధాన్యతనివ్వాలని, వీఐపీ లపై…

TELANGANA

‘భూ భారతి’కి గవర్నర్ ఆమోదం.. రానున్న మార్పులివే..

గత ప్రభుత్వంలో అస్తవ్యస్తమైన రెవెన్యూశాఖను ప్రక్షాళన చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూ భారతి బిల్లుకు గవర్నర్ బిష్ణుదేవ్ శర్మ ఆమోద ముద్ర వేశారు. గ‌వ‌ర్న‌ర్ ఆమోదించిన బిల్లు కాపీని గురువారం స‌చివాల‌యంలో రెవెన్యూశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి న‌వీన్ మిట్ట‌ల్.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. వీలైనంత త్వరలో ఈ బిల్లును అమల్లోకి తీసుకొస్తామని తెలిపారు. ఇందుకోసం అధికారులు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. తెలంగాణ ప్ర‌జానీకానికి మెరుగైన‌, స‌మ‌గ్ర‌మైన…

TELANGANA

హైదరాబాద్‌కు ధీటుగా మరో నగరం..? ఆ నగరం అభివృద్ది సీఎం రేవంత్ ఫోకస్..

హైదరాబాద్‌ తరహాలో వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌రంగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆ విధంగా విమానాశ్ర‌యానికి రూప‌క‌ల్ప‌న చేయాల‌ని సూచించారు. మామూనూరు ఎయిర్‌పోర్టు భూ సేక‌ర‌ణ‌, ఇత‌ర ప్ర‌ణాళిక‌ల‌పై ఐసీసీసీలో సీఎం రేవంత్‌రెడ్డి గురువారం రాత్రి స‌మీక్ష నిర్వ‌హించారు.   ద‌క్షిణ కొరియాతో పాటు ప‌లు దేశాలు త‌మ పెట్టుబ‌డుల‌కు ఎయిర్‌పోర్టును ప్రాధాన్యంగా ఎంచుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆయా దేశాల పెట్టుబ‌డులు ఆక‌ర్షించేలా వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యం ఉండాల‌న్నారు. కొచ్చి ఎయిర్‌పోర్టు అన్ని వ‌స‌తుల‌తో ఉంటుంద‌ని..…

National

గ్రామస్తులందరికీ ఊడిపోతున్న జుట్టు.. ఆ మూడు గ్రామాల్లో మిస్టరీ వ్యాధి..?

ప్రస్తుతం హెఎం పివి (HMPV) వైరస్ చైనాలో ప్రబలంగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మారి కేసులు మన దేశంలో కూడా నమోదు అవుతున్నాయి. దీంతో భారత ప్రభుత్వం, రాష్ట్రాలు కూడా అలెర్ట్‌గా మారాయి. ఈ వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు పలు మార్గదర్శకాలు జారీ చేశారు అధికారులు. అయితే, హెచ్‌ఎంపీవీ (HMPV) వైరస్‌ భయం ఒకవైపు ఉండగా.. మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో కొత్తగా తెలియని వైరస్ కలకలం సృష్టిస్తోంది. కేవలం వారం రోజుల్లోనే చాలా మంది ప్రజలు తమ తలపై…

AP

ఈ నెలాఖరు నుంచి ప్రజల్లోనే జగన్..?

వైసీపీ అధినేత జగన్ ఇవాళ తాడేపల్లిలో నెల్లూరు జిల్లా వైసీపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని, చంద్రబాబు దుర్మార్గపు పరిపాలన వల్ల మనం ప్రజలకు తోడుగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.   మన పాలనలో అన్నీ ఇంటివద్దనే డోర్ డెలివరీ చేశాం… కానీ ఇప్పుడు ప్రజలు టీడీపీ నాయకుల వద్దకు తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని జగన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలో మనమంతా…

AP

భక్తులు పెద్ద ఎత్తున వస్తారని తెలిసీ.. ఏర్పాట్లు ఎందుకు చేయలేదు?: చంద్రబాబు తీవ్ర ఆగ్రహం..

వైకుంఠద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున వస్తారని తెలిసి కూడా అందుకు తగినట్లుగా ఏర్పాట్లు ఎందుకు చేయలేదంటూ ఏపీ సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆయన సమీక్షించారు. ఏపీ డీజీపీ, టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.   భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా…

TELANGANA

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి: రేవంత్ రెడ్డి..

స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో ఉంటాయని, కాంగ్రెస్ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిన్న సాయంత్రం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో నిర్వహించిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. మన పథకాలను ఇంటింటికి చెప్పాలని సూచించారు.   అధికారంలోకి వచ్చిన కొన్నిరోజుల్లోనే 55 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, రూ.21 వేల…

TELANGANA

లుచ్చాగాళ్ల ముందు తల వంచను.. విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..

ఏసీబీ విచారణ కోసం తన నివాసం నుంచి ఏసీబీ కార్యాలయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయలుదేరారు. తన ఇంటికి వచ్చిన బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన ఇంటి నుంచి వెలుపలకు వచ్చారు. అనంతరం అక్కడున్న మీడియాతో మాట్లాడి… ఏసీబీ కార్యాలయానికి బయల్దేరారు. తన లాయర్ రామచంద్రరావుతో కలిసి వెళ్లారు.   “తెలంగాణ బిడ్డగా, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన కార్యకర్తగా, కేసీఆర్ సైనికుడిగా రాష్ట్ర ప్రతిష్ఠ పెంచడానికి, హైదరాబాద్ ను ప్రపంచపటంలో నిలపడానికి మంత్రిగా…