Editor

AP

విశాఖ పర్యటనకు మోడీ.. స్టీల్‌ప్లాంట్‌పై కీలక ప్రకటన..!

ప్రధాని నరేంద్రమోడీ పర్యటనలో పలు కీలక ప్రాజెక్టులు పట్టాలెక్కబోతున్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర వాసులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న రైల్వేజోన్ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు ప్రధాని. అనకాపల్లి జిల్లా పూడిమడక దగ్గర NTPC గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ పనులను ప్రారంభిస్తారు. రెండు దశల్లో లక్షా 85వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. రోజుకు 15 వందల టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌తో పాటు అమ్మోనియా, మిథనాలను, సస్టెయినబుల్…

TELANGANA

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు..

హైదరాబాద్‌ విపత్తు స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ ఏజెన్సీ (హైడ్రా) విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరింత పటిష్ఠ చర్యలకు దారితీసింది. ఈ క్రమంలో హైడ్రా కోసం ప్రత్యేక పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తూ మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. బుద్ధభవన్‌ భవనంలోని B-బ్లాక్‌లో ఈ పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. హైడ్రాకు విస్తృతమైన అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నగరంలోని జలాశయాలు, చెరువులు,…

TELANGANA

నేడు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ, ఈడీ విచారణ..

నేడు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ, ఈడీ విచారణ జరగనుంది. ఈ విచారణకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరు కానున్నారు. అరవింద్ కుమార్‌ను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. మరోవైపు ఈడీ విచారణకు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్‌ఎన్ రెడ్డి హాజరు కానున్నారు. ఈడీ బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది. ఏసీబీ, ఈడీ విచారణ 10:30 కు ప్రారంభం అవుతుంది.   ఇదిలా ఉండగా.. సంచలనం సృష్టిస్తున్న ఫార్ముల ఈ…

AP

కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి వరాల జల్లు..

చిత్తూరు జిల్లా ఎన్టీఆర్ స్టేడియంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభం, శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వ ప్రత్యేక నిధులు రూ.10 కోట్లతో కుప్పం మున్సిపాలిటీలో అర్బన్ ప్రాజెక్టుల నిర్వహణ, అధికారుల అతిథి గృహాల నిర్మాణం కోసం సమీకృత కాంప్లెక్స్, కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మాణం చేపట్టనున్నారు. రూ.60.20 కోట్లతో కుప్పంలో ఏర్పాటు చేసిన డీకే పల్లి పార్కుల అభివృద్ధి, సుందరీకరణ, కుప్పం ఏరియా అభివృద్ధిలో రోడ్డు జంక్షన్లు, వీధి దీపాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే.. రూ.110.21…

AP

HMPVపై ఏపీ సర్కార్‌ అలెర్ట్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..

కరోనా మహమ్మారి పుట్టినిల్లు అయిన చైనాలో వెలుగు చూసిన ‘‘హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (HMPV)’’ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.. భారత్‌లో అధికారికంగా HMPV మూడు పాజిటివ్‌ కేసులు నమోదు కావడం సంచలనంగా మారింది. బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు , అహ్మదాబాద్‌లో రెండేళ్ల చిన్నారికి HMPV పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ.. గైడ్‌లైన్స్‌ విడుదల చేసిన విషయం విదితమే కాగా.. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో…

AP

నేను అబద్ధం చెబితే వెంకటేశ్వరస్వామి నన్ను శిక్షిస్తాడు: విజయసాయిరెడ్డి..

కాకినాడ సీ పోర్టు, సెజ్ కు సంబంధించి అక్రమంగా షేర్లను బదలాయించుకున్నట్టు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీ రావు) అనే వ్యక్తి ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేయడం తెలిసిందే. సీఐడీ కేసు ఆధారంగా ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో నేడు విజయసాయిరెడ్డి హైదరాబాదులో ఈడీ విచారణకు హాజరయ్యారు. విచారణ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తనను ఆరు గంటల పాటు ప్రశ్నించారని, 25 ప్రశ్నలు అడిగారని వెల్లడించారు. కేవీ…

National

బెంగళూరులో హెచ్ఎంపీవీ కేసులు… ఐసీఎంఆర్ స్పందన..

కరోనా మహమ్మారి దెబ్బకు హడలిపోయిన ప్రపంచ దేశాలను మరో వైరస్ కలవరపెడుతోంది. దాని పేరు హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాన్యూమా వైరస్). చైనాలో ఈ వైరస్ తీవ్రస్థాయిలో ప్రబలుతోందంటూ ఇటీవల కథనాలు వచ్చాయి.   తాజాగా, భారత్ లోనూ హెచ్ఎంపీవీ వైరస్ కలకలం రేగింది. బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్టు తేలింది. ఈ నేపథ్యంలో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఆసక్తికరంగా స్పందించింది. ప్రపంచ దేశాల్లోనే కాకుండా, భారత్ లోనూ ఈ వైరస్ వ్యాప్తిలో…

TELANGANA

ప్రారంభమైన చర్లపల్లి టెర్మినల్..

దాదాపు 100 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నగరంలో రూపుదిద్దుకున్న మరో నూతన రైల్వేస్టేషన్ చర్లపల్లి టెర్మినల్ ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ వర్చువల్ గా ప్రారంభించారు. రూ.428 కోట్లతో ఆధునికీకరించిన ఈ టెర్మినల్ లో తొమ్మిది ప్లాట్ ఫామ్స్, ఐదు ఎస్కలేటర్లు, తొమ్మిది లిఫ్ట్ లు, రెండు ఫుట్ ఓవర్ వంతెనలు అందుబాటులోకి వచ్చాయి. క్రమక్రమంగా కొన్ని ప్రధానమైన దూర ప్రాంత రైళ్లను ఈ టెర్మినల్ కు మార్చబోతున్నారు. ప్రయాణికులు ఈ స్టేషన్ కు చేరుకునేందుకు ఎంఎంటీఎస్ సర్వీసులను…

TELANGANA

ఆరాంఘర్ ఫ్లై ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మన్మోహన్ పేరు.

హైదరాబాద్ నగర అభివృద్ధికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగర ప్రజలకు మరో భారీ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఆరాంఘర్ – జూ పార్క్ ఫ్లై ఓవర్ ను సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రూ. 799 కోట్ల వ్యయంతో ఫ్లై ఓవర్ ను జీహెచ్ఎంసీ నిర్మించింది. మొత్తం ఆరు లైన్లతో 4.8 కిలోమీటర్ల పొడవు, 23 మీటర్ల వెడల్పుతో ఫ్లైఓవర్ ను నిర్మించారు.   ఆరాంఘర్…

National

దేశీయంగా ప్రభుత్వ బడుల్లో భారీగా తగ్గిన విద్యార్థుల సంఖ్య..

దేశంలోని ప్రభుత్వ పాఠశాల్లలో విద్యార్థుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల నమోదైందని కేంద్ర పాఠాశాల విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించి రెండు యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (UDISE+) నివేదికల్ని విడుదల చేసింది. ఇందులో 2018-19 తో పోల్చితే 2023-24 విద్యా ఏడాదిలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యలోని తగ్గుదలను ప్రస్తావించింది.   UDISE+ అనేది ప్రీ-ప్రైమరీ స్థాయి నుంచి హయ్యర్ సెకండరీ వరకు పాఠశాల విద్యార్థులకు సంబంధించిన అన్ని…