వైసీపీ కొత్త ప్రకటన..
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల మార్పులు చేర్పుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పలు అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు సమన్వయకులను మార్చేసింది. వారి స్థానంలో కొత్త నాయకులను తెరమీదికి తీసుకొచ్చింది. గుంటూరు, ఒంగోలు, నెల్లూరు.. వంటి లోక్‌సభ స్థానాలకు కొత్త సమన్వయకులు అపాయింట్ అయ్యారు ఇదివరకే. ఇటీవలే మచిలీపట్నం లోక్‌సభ, అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ రెండు నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలను మార్చివేసింది వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం. గెలుపోటములకు సంబంధించిన…

