తెలంగాణలో కొత్త పార్కింగ్ పాలసీ..!
తెలంగాణలో వాహనాల పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. రోడ్లపై అడ్డగోలుగా వాహనాలు నిలపడం, రోజుల తరబడి వదిలేయడం వంటి చర్యలతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పాటు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ కొత్త పార్కింగ్ పాలసీ ముసాయిదాను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూపుదిద్దుకున్న ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే, వాహనదారుల జేబుకు చిల్లు పడటమే కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వాహనాన్ని…

