తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ‘ఎస్ఐఆర్’.. జూన్ 15 నుంచి ప్రక్రియ షురూ..
తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. ఈ ‘ఎస్ఐఆర్’ ప్రక్రియకు సంబంధించిన వివరాలను శనివారం ఆయన మీడియాతో పంచుకున్నారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు అధికారులు, బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారని తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా బీఎల్‌వోలు ప్రతి ఇంటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫామ్‌లు ఇస్తారని…

