అమరావతిలో హైటెన్షన్.. వైసీపీ నేతల పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత.. రాళ్లు, కోడిగుడ్లతో దాడి..!
ఏపీ రాజధాని అమరావతిలో వైకాపా నేతలు చేపట్టిన పర్యటన.. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రాజధాని భూముల పరిశీలనకు వచ్చిన మాజీ మంత్రి పేర్నినాని, లేళ్ల అప్పిరెడ్డి, సీఆర్డీఏ పరిరక్షణ బృందాన్ని ఉండవల్లి సెంటర్ లో రైతులు అడ్డుకున్నారు. రాజధానిగా అమరావతిని అంగీకరించాకే పర్యటించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు, రైతుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్లు విసరడంతో ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి. ఓ దశలో…

