Editor

TELANGANA

ట్రాఫిక్‌ చలానాలపై మరోమారు రాయితీ

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్‌ చలానాలను వసూలు చేసేందుకు పోలీసుశాఖ మరోమారు సన్నద్దమవుతోంది. ఇందుకు భారీగా రాయితీలు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. గత ఏడాది ఇలా రాయితీ ప్రకటించడంతో ఏకంగా రూ.300 కోట్ల వరకూ చలానాల రుసుము వసూలయింది. ఇదే తరహాలో మరోమారు రాయితీలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి.

AP

పవన్ ఆ ఒక్క హామీతో ఉద్యోగ, ఉపాధ్యాయులు యూటర్న్..

గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు వైసిపి ఇచ్చిన హామీల్లో ఉద్యోగుల సిపిఎస్ రద్దు ఒకటి. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే దీన్ని రద్దు చేయిస్తానని జగన్ హామీ ఇచ్చారు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎంతగానో నమ్మారు. జగన్ ను తన సొంత వాడిలా భావించారు. తాము మద్దతు తెలపడమే కాకుండా.. ఇతరులపై ప్రభావం చూపారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారం దాటింది.. రెండు వారాలు దాటాయి.. వందల వారాలు దాటిపోయాయి. కానీ సిపిఎస్ మాత్రం రద్దు…

AP

ఏపీలో ఎన్నికలకు వేళైంది.. డేట్ ఫిక్స్?

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సన్నాహాలు ప్రారంభించింది. గురువారం ఎన్నికల కమిషన్ అధికారులు ఏపీ రానున్నారు. దీంతో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సన్నాహాలు ప్రారంభమైనట్టేనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ లెక్కన ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ వెల్లడయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ సీఎం జగన్ 20 రోజులు ముందుగానే ఎన్నికలు వస్తాయని మంత్రివర్గంలో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అటు టిడిపి అధినేత చంద్రబాబు సైతం ఏ…

CINEMA

‘సలార్’ కోసం ప్రభాస్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?..

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 22న థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. అయితే బాహుబలి సినిమాతో ప్రభాస్ వరల్డ్ ఫేమస్ అయ్యాడు. రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేశాడు. తాజాగా సలార్ సినిమాకు ప్రభాస్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ సినిమాకు ప్రభాస్ రూ.100 కోట్లు తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది.

TELANGANA

రైతు బంధు పై కాంగ్రెస్ మాట.. ఆర్థిక పరిస్థితి పై శ్వేత పత్రం బాట..

అధికారంలోకి రాగానే వెంటనే రైతు భరోసా డబ్బులు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అప్పట్లో ఎన్నికల సంఘం రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు ఒప్పుకుంది. అయితే ప్రభుత్వం ఖాతాలో డబ్బులు లేకపోవడంతో రైతుబంధు ఆగిపోయింది. ఆ తరుణంలో రైతులకు సంబంధించి తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు భరోసాను ఎకరానికి 2500 పెంచి వేస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనిపై అప్పట్లో అటు భారత రాష్ట్ర సమితి ఇటు…

TELANGANA

తెలంగాణలో కరోనా కలకలం.. ఒకరు మృతి..

2020లో కరోనా వ్యాప్తి ప్రారంభమైంది. 2021లోనూ కొనసాగింది. వేలాదిమంది మృత్యువాత పడ్డారు. ప్రపంచాన్ని వణికించింది ఈ మహమ్మారి. వ్యాక్సినేషన్ ప్రారంభం కావడంతో వైరస్ వ్యాప్తి తగ్గింది. గత రెండు సంవత్సరాలుగా ఎటువంటి ప్రభావం చూపలేదు. కానీ తాజాగా కొత్త సబ్ వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉంది. దీంతో దేశవ్యాప్తంగా కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా కేరళలో మాత్రం పరిస్థితి విషమంగా ఉంది. అక్కడ వందలాది కేసులు నమోదవుతుండడంతో ప్రభుత్వం అలెర్ట్ అయింది.   తాజాగా తెలంగాణలో కేసులు…

AP

ఏపీలోనూ మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం.. చంద్రబాబు హామీ.

ఇటీవల ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అన్న హామీ బాగానే వర్కౌట్ అవుతోంది. తొలుత కర్ణాటకలో ఇది హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. తెలంగాణలో సైతం ఇదే హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ కూడా విజయం సాధించగలిగింది. ఇప్పుడు ఏపీలో ఈ హామీ తెరపైకి వచ్చింది. చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో టిడిపి నిర్వహించిన ‘యువగళం- నవ…

AP

మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు జగన్ ను.. పవన్ సంచలన కామెంట్స్..

నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లిలో ‘యువగళం – నవశకం’పేరిట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. పవన్ రాకతో ప్రాంగణం మార్మోగిపోయింది. ఈ సందర్భంగా పవన్ జగన్ సర్కార్ పై హాట్ కామెంట్స్ చేశారు. ప్రజాస్వామ్య విలువలు తెలియని వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఏదైనా మాట్లాడితే దూషిస్తారు.. దాడులు చేస్తారు.. మహిళలను కించపరిచే సంస్కృతికి వైసిపి శ్రీకారం చుట్టిందన్నారు. ఇంట్లో ఉన్న తల్లికి,చెల్లికి…

CINEMA

సలార్ కు రెండు ప్రభుత్వాల ఓకే.. టికెట్ రేట్లు ఎంత పెంచారంటే

ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న సలార్ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇక అందులో భాగంగానే ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందింది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా టికెట్ల ధరల పెంపునకు రెండు ప్రభుత్వాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే సింగిల్ థియేటర్ లో టికెట్ రేట్ ఎంతవరకు పెంచారు,అలాగే మల్టీప్లెక్స్ లో అయితే ఎంతవరకు పెంచారు అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం…

AP

వైజాగ్ స్టీల్ పై కేంద్రం గుడ్ న్యూస్-ఆ తర్వాతే ప్రైవేటీకరణ..!

ఏపీలో ఎన్నికల వేళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై భారీ ఊరట లభించింది. ఇన్నాళ్లూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ ప్రారంభించామని, ఎట్టి పరిస్ధితుల్లోనూ ఇది ఆగదని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా దీన్ని ఏడాదిలోగా పూర్తి చేస్తామని చెబుతూ వచ్చిన కేంద్రం.. ఇవాళ మాత్రం కాస్త మెత్తబడినట్లు కనిపిస్తోంది. తాజాగా పార్లమెంట్ లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పందిస్తూ కీలక సమాచారం ఇచ్చింది. దీంతో కార్మికుల ఆందోళన కొంతమేర ఫలించినట్లే కనిపిస్తోంది.   విశాఖ స్టీల్…