4news HD TV

TELANGANA

తెలంగాణకు త్వరలో మరో మూడు వందే భారత్ రైళ్లు

ఇటీవలే సికింద్రాబాద్- విశాఖపట్నం వందేభారత్ రైలు (Vande Bharat Train) ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ రైలుకు ప్రయాణికుల నుండి అనూహ్య రీతిలో ఆదరణ లభిస్తోంది. కాగా హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు త్వరలో మరో మూడు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. కాచిగూడ- బెంగళూరు, సికింద్రాబాద్- తిరుపతి, సికింద్రాబాద్-పూణే మధ్య మూడు రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. మరో మూడు ఇలాంటి రైళ్లను త్వరలో ప్రారంభించాలని భారతీయ రైల్వే యోచిస్తోందని అధికారులు తెలిపారు. అదనపు…

APTELANGANA

భీమారం లో పిచ్చి కుక్కల స్వైర విహారం..

4 H D మంచిర్యాల జిల్లా// భీమారం లో పిచ్చి కుక్కల స్వైర విహారం.. పిల్లలు ఇంటి ముంగిట ఆడుకుంటుండగా పిచ్చి కుక్కల దాడి.. దాడిలో తీవ్రంగా గాయపడ్డ నలుగురు పిల్లలు.. పాక లో కట్టి ఉంచిన పశువులను కూడా వదలని పిచ్చి కుక్కలు.. పనులకు వెళ్లకుండా కర్రలతో ఇంటికి కాపలా కాస్తున్న పలు కాలనీవాసులు.. రెండురోజులుగా విన్నవించినా పట్టించుకోని సర్పంచ్ మరియు అధికారులు..

TELANGANA

తెలంగాణ ఎన్నికల్లో జనసేన, టీడీపీ పొత్తుపై `వీర విజేత` ఆశలు

`ఉట్టికి ఎక్కలేనమ్మ, ఆకాశానికి ఎగిరినట్టు..` అనే సామెత. దాన్ని జనసేనకు వర్తింప చేస్తే అతికినట్టు సరిపోతుంది. ఎనిమిదేళ్లుగా ఆ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో (Pawan Varaahi) ఆ పార్టీకి ఇప్పటి వరకు గుర్తింపు లేదు. పైగా ఆ పార్టీ సింబల్(Symbol) తిరుపతి లోక్ సభ ఎన్నికల్లోనే స్వతంత్రులకు కేటాయించారు. ఇటీవల ఎన్నికల కమిషన్ ప్రకటించిన గుర్తింపు కలిగిన పార్టీల జాబితాలో జనసేన లేదు. ఈసారి ఆ పార్టీకి కామన్ సింబల్ ఉంటుందన్న…

AP

ఏలూరు ముస్లిం యూత్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించిన “పురోగమనమా? తిరోగమనమా?”

ఏలూరు ముస్లిం యూత్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించిన “పురోగమనమా? తిరోగమనమా?” ఓ మనిషి నీ పయనం ఎటు అన్న అంశంపై అల్లూరి సీతారామరాజు స్టేడియం వద్ద కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముఖ్య వక్త గా పాల్గొన్న పీస్ మెసేజ్ ఫౌండేషన్ (పిఎంసి) వ్యవస్థాపకులు, ప్రెసిడెంట్ సిరాజుర్రహ్మాన్, సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు నగరపాలక సంస్థ కో- ఆప్షన్ సభ్యులు శ్రీ ఎస్ ఎం ఆర్ పెదబాబు గారు ..…

AP

ప్రభుత్వోన్నత పాఠశాలలో 1983-84వ సంవత్సర పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

కాకినాడ జిల్లా కిర్లంపూడి శ్రీ కొక్కొండ రామశేషగిరి రావు పంతులు ప్రభుత్వోన్నత పాఠశాలలో 1983-84వ సంవత్సర పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఘనంగా నిర్వహించారు.ముందుగా పాఠశాలకి చేరుకొని ఆనాటి మధుర జ్ఞాపకాలను ప్రతిఒక్కరూ నెమరు వేసికొన్నారు.ఈ సందర్భంగా విద్యాబుద్ధులని నేర్పించిన గురువులకు ఘన సన్మానం చేశారు.వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో ఆద్యంతం ఆనందంగా గడిపారు.ప్రతిఒక్కరూ ఒకరి ఒకరికి పరిచయం చేసికొని ఎవరికి ఏ అవసరం వచ్చినా అండగా ఉండాలని తెలియపరచారు.ఈ సందర్భంగా విద్యా బుద్ధులు…

National

కొత్త పార్టీ ఎంట్రీతో.. త్రిపురలో బీజేపీకి చిక్కులు!

త్రిపురలో ఎన్నికల హడావుడి తారస్థాయికి చేరింది. ప్రజలను ఆకర్షించేందుకు పార్టీలన్నీ తమ అస్త్రాలకు పదును పెడుతున్నాయి. ఈక్రమంలో అధికార బీజేపీని ఓడించేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. బద్ధ శత్రువులగా ఉండే కాంగ్రెస్​, వామపక్షాలు కలిసిపోయాయి. బీజేపీకి ఇదొక చిక్కు అయితే.. వీటి మధ్య ఈ దఫా ఎన్నికల్లో కొత్త పార్టీ పోటీచేస్తుండటం మరో సమస్య! అదే.. కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రద్యుత్​ బిక్రమ్​ మానిక్య దేబ్​ బర్మ స్థాపించిన టిప్రా మోతా పార్టీ. కొత్త పార్టీ…

National

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తదుపరి డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ విక్రమ్ దేవ్ దత్

సీనియర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ విక్రమ్ దేవ్ దత్ (Vikram Dev Dutt) డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తదుపరి డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. శనివారం ఆయన పేరును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ప్రస్తుత డీజీసీఏ చీఫ్ అరుణ్ కుమార్ స్థానంలో ఆయన ఫిబ్రవరి 28న బాధ్యతలు స్వీకరించనున్నారు. విక్రమ్ దేవ్ దత్ 1993 బ్యాచ్ IAS అధికారి. ప్రస్తుతం ఎయిర్ ఇండియా అసెట్ హోల్డింగ్ చైర్మన్. 1989 బ్యాచ్ ఐఏఎస్ అయిన…

TELANGANAWorld

హైదరాబాద్ వచ్చిన చేగువేరా కూతురు, మనుమరాలు

విప్లవ యోధుడు చేగువేరా (Cheguvera) కుమార్తె డాక్టర్ అలైదా గువేరా హైదరాబాద్ వచ్చారు. ఆమెతో పాటు చేగువేరా మనవరాలు ప్రొఫెసర్ ఎస్తెఫానియా గువేరా కూడా నగరానికి వచ్చారు. వీరికి అధికారులు, ప్రజాసంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు రవీంద్రభారతిలో జరిగే ‘క్యూబా సంఘీభావ సభ’కు అలైదా గువేరా, ఎస్తెఫానియా ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో బీజేపీ, ఎంఐఎం మినహా ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా చాలా…

AP

సింగర్ మంగ్లీకి చేదు అనుభవం.. కారుపై రాళ్ల దాడి..

తెలుగు ప్రేక్షకులకు మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు సింగర్ మంగ్లీ అంటే ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ ప్రజలను చైతన్యపరిచేలా పాటలు పాడిన సింగర్ మంగ్లీ.. తర్వాత సినిమా పాటలతో కూడా బాగా పాపులర్ అయింది. ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి సొంతంగా పాటలు నిర్మించడం, పాడటం చేసింది. మొత్తానికి సింగర్ మంగ్లీ అంటే తెలుగు వాళ్లు ఎక్కడ ఉన్నా గుర్తుపట్టే స్థాయిని సంపాదించుకుంది. సింగర్ మంగ్లీ సినిమాలతో పాటు పలు ఈవెంట్లలో…

AP

SC సెల్ ఆధ్వర్యంలో యువగళం మహా పాదయాత్ర కార్యక్రమాన్ని జయప్రదం

ఏలూరు జిల్లా SC సెల్ ఆధ్వర్యంలో యువగళం మహా పాదయాత్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయండి బడేటి రాధాకృష్ణ (చంటి) ఏలూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఈరోజు ఏలూరు తెలుగుదేశం పార్టీ బడేటి క్యాంప్ కార్యాలయం నందు ఏలూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారి ఆశీస్సులతో SC సెల్ ఏలూరు పార్లమెంట్ అధ్యక్షులు యాళ్ల సుజీవరావు ఆధ్వర్యంలో పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులను సమీకరించి ఒక రోజు ముందుగా లోకేష్…