పవన్ వారాహి టూర్ స్పెషల్ ! పొత్తు తర్వాత తొలిసారి-గ్రౌండ్లో జనసేనతో పాటు టీడీపీ !
ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. చంద్రబాబును స్కిల్ స్కాంలో అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో పెట్టిన తర్వాత అక్కడికి వెళ్లి పరామర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .. అక్కడే పొత్తు కూడా ప్రకటించేశారు. తద్వారా టీడీపీ శ్రేణుల్లోనూ స్ధైర్యం సన్నగిల్లకుండా చేశారు. ఇప్పుడు అక్టోబర్ 1 నుంచి వారాహి నాలుగో దశ యాత్రను కూడా ప్రారంభించడం ద్వారా ఇరు పార్టీల శ్రేణుల్ని ఉమ్మడిగా తనవైపు తిప్పుకునేలా ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత…

