4news HD TV

AP

ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేదు, కనీసం ఎంపీ టిక్కెట్ ఇవ్వండి, ఇదేమి డిమాండ్ స్వామి!

బెంగళూరు/శివమొగ్గ: మాజీ ఉపముఖ్యమంత్రి కె.ఎస్.ఈశ్వరప్ప ఆయన కుమారుడు కే.ఇ. కాంతేష్ ను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని ఇప్పటి నుంచే టికెట్‌ కోసం ప్రయత్నాలు చేయనున్న సంగతి తెలిసిందే. కాంతేష్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు స్వయంగా బీజేపీ సీనియర్ నాయకుడు కేఎస్. ఈశ్వరప్ప సోమవారం హవేరిలో చెప్పారు. హావేరిలో ఈశ్వరప్ప విలేకరులతో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌ కోసం నా కుమారుడు కాంతేష్‌ ప్రయత్నాలు చేస్తున్నాడని అన్నారు. భార్యను చంపేసి బాత్ రూమ్ లో…

AP

జగన్ వద్దే తేల్చుకున్న అనిల్ కుమార్ యాదవ్

అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు సిటీ శాసన సభ్యడు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. కొంతకాలంగా వార్తల్లో వ్యక్తిగా ఉంటోన్నారు. పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, త్వరలోనే గుడ్‌బై చెప్పొచ్చనే ప్రచారం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో విస్తృతంగా సాగింది. సొంత పార్టీలోనే తనకు వెన్నుపోటుదారులు ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. దీనికి మరింత బలాన్నిచ్చాయి. వైఎస్ఆర్సీపీలో కొనసాగడంపైనా క్లారిటీ ఇచ్చారాయన. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తన గుండె చప్పుడుగా అభివర్ణించారు.…

APTELANGANA

రైల్వేలో ఇంతకంటే అన్యాయం మరొకటుంటుందా?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని దక్షిణ మధ్య రైల్వే ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఇతర జోన్లు ఈ ప్రతిపాదనలను అడ్డుకుంటున్నాయి. వాటికి అవి చెప్పే కారణం ఒకటే.. ట్రాక్ రద్దీ అని. 21 రైళ్లను ప్రవేశపెట్టాలని, వీటిల్లో కొన్ని రోజువారీ, మరికొన్నింటినీ వారానికి రెండు సార్లు, కొన్నింటిని వారానికోసారి నడిపేలా అధికారులు ప్రణాళికలు రచించారు. కొన్నింటిని జోన్లు అడ్డుకుంటుంటే మరికొన్నింటినీ రైల్వే బోర్డు పక్కన పెట్టింది. జోన్ల మధ్య సమన్వయం…

APTELANGANA

నక్కతోకను తొక్కిన హీరోయిన్ శ్రీలీల

సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం చిత్రీకరణ కోసం రంగంలోకి దిగారు. శనివారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఏప్రిల్ మొదటివారంలో ఒక షెడ్యూల్ ను పూర్తిచేసుకున్న ఈ సినిమా సుదీర్ఘ విరామం తర్వాత పట్టాలెక్కడం గమనార్హం. మహేష్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికో రూపొందుతోన్న మూడో సినిమా ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలందిస్తున్నారు. ఆసక్తికరమైన కాంబినేషన్ లో…

AP

నెల్లూరు అసెంబ్లీ బరిలో అనిల్ వర్సస్ ఆనం – బస్తీ మే సవాల్..!?

నెల్లూరులో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. మాజీ మంత్రులు అనిల్ వర్సస్ ఆనం మధ్య సవాళ్లు కొనసాగుతున్నాయి. వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఆనం టీడీపీలో చేరేందుకు రంగం సిద్దమైంది. ఇదే సమయంలో ఆనం లక్ష్యంగా అనిల్ మాటల తూటాలు పేల్చుతున్నారు. దమ్ముంటే తన పైన పోటీ చేసి గెలవాలని సవాల్ చేస్తున్నారు. తన రాజకీయం నెల్లూరులో ఆరంభమైందని..నెల్లూరులోనే ముగింపు కావాలనుకుంటున్నానంటూ ఆనం అసలు విషయం తేల్చేసారు. ఆనంకు అనిల్ సవాల్ : వైసీపీ రెబల్ ఎమ్మెల్యే…

National

“వ్యూహం” పై ఆర్జీవీకి కాంగ్రెస్ వార్నింగ్ – బట్టలూడదీసి కొడతాం, ఖబడ్దార్..!!

వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మకు కాంగ్రెస్ నుంచి హెచ్చరికలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి జగన్ పొలిటికల్ లైఫ్ ఆధారంగా ఆర్జీవీ తీస్తున్న వ్యూహం టీజర్ కు విశేష స్పందన వచ్చింది. అందులో వైఎస్సార్ మరణం సమయం నుంచి రాజకీయంగా జగన్ చేసిన రాజకీయ పోరాటం హైలైట్ చేసారు. కాంగ్రెస్ తీరు..కేసులు…సీబీఐ విచారణ..ఓదార్పు యాత్ర అన్నీ కంటికి కట్టినట్లుగా చూపించే ప్రయత్నం చేసి నట్లుగా స్పష్టం అవుతోంది. దీని పైన ఇప్పుడు కాంగ్రెస్ నేతలు సీరియస్ అవుతున్నారు. వ్యూహం…

National

మహారాష్ట్రపై ఫుల్ ఫోకస్: కేసీఆర్ రెండ్రోజుల పర్యటన, కీలక నేతల చేరిక

హైదరాబాద్: మహారాష్ట్రపై భారత్ రాష్ట్ర సమితి(BRS) ప్రత్యేక ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపట్నుంచి(జూన్ 26) రెండు రోజులపాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. మహారాష్ట్రలోని పండరీపూర్, తుల్జాపూర్‌లో ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం షోలాపూర్‌లో నిర్వహించే పార్టీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు రోడ్డు మార్గాన హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు బయల్దేరి వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్ వెంట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,…

National

నీతో పనేంటి- ఆర్టీసీ బస్ నుంచి కండక్టర్‌ను గెంటేసిన మహిళా ప్రయాణికులు

బెంగళూరు: కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఉచితంగా ప్రయాణించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిన నేపథ్యంలో మహిళలు దీన్ని వినియోగించుకుంటోన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలామందికి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తోన్నారు. అవసరం ఉన్నా, లేకపోయినా ఆర్టీసీ బస్సుల్లో ట్రావెల్ చేయడానికి వెనుకాడట్లేదు. ఈ నెల 11వ తేదీన కర్ణాటకలో ఈ పథకం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీని కింద మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా…

APTELANGANA

కలలో దేవుళ్ళు, దేవతా మూర్తులు: దేనికి సంకేతమో తెలుసుకోండి!!

స్వప్న శాస్త్రం ప్రకారం చాలామందికి కలలో దేవుళ్ళు, మరియు దేవతామూర్తులు కనిపిస్తూ ఉంటారు. అలా కలలో దేవుడు కనిపించడం భవిష్యత్తులో జరిగే అనేక పరిణామాలకు సూచన అని చెబుతున్నారు. స్వప్న శాస్త్రం ప్రకారం రాత్రిపూట నిద్ర పోయే సమయంలో మనకు వచ్చే కలలు దేవుళ్ళు లేదా వివిధ దేవతలు కనిపిస్తే ఆ కలల యొక్క అర్థం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కలలో శ్రీరాముడు కనిపిస్తే జీవితంలో గొప్ప విజయాన్ని సాధించబోతున్నారని అర్థం. జీవితంలోపురోగతికి మార్గం తెరవబడుతుంది…