4news HD TV

TELANGANA

కేంద్ర మంత్రిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్‌

రెజర్ల నిరసనలపై స్పందించాలంటూ మీడియా ప్రశ్నించిన టైంలో కేంద్రమంత్రి మీనాక్షి లేఖి అక్కడ నుంచి పరుగుల తీసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై కాంగ్రెస్ నేతలు ఘాటుగా రియాక్ట్ అయింది. ఈ ఇష్యూపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా రీట్వీట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే.. బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేయాలని రెజ్లర్లు…

APNational

విశాఖలో సుపారీ గ్యాంగ్ గుట్టురట్టు.. ఆరుగురు అరెస్ట్

విశాఖపట్నంలో ఓ సుపారీ గ్యాంగ్ గుట్టు రట్టు అయ్యింది. వైజాగ్ క్రైమ్ పోలీసులు ఆ సుపారీ గ్యాంగ్‌ను అర్థరాత్రి పట్టుకున్నారు. న్యూకాలనీ లక్ష్మీరాయల్ హొటల్‌లో రూమ్ నంబర్ 105లో ఆ ముఠా ఉందని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో.. పోలీసులు ఓ ప్లాన్‌తో రంగంలోకి దిగి, నిందితులకు అనుమానం రాకుండా హోటల్‌లో ఎంట్రీ ఇచ్చి, వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరుగురి సభ్యులు ఉండగా.. వారిని అరెస్ట్ చేశారు. నిందితులందరూ మహారాష్ట్రకు చెందినవారిగా గుర్తించారు. వీళ్లు…

CINEMATELANGANA

పవిత్ర అంటే ఎందుకంత పిచ్చి నరేషా..

లేటు వయస్సులో ఘాటు ప్రేమతో ఓ రేంజులో వివాదాలను సృష్టించిన ముదురు జంట పవిత్ర-నరేష్.. ఎవరెన్ని విమర్శలు చేసినా అవి మాకు ఆశీస్సులు అంటూ ఇంకాస్త రెచ్చిపోతున్నారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్ మూడో భార్యకు విడాకులు ఇచ్చి పవిత్రతో సహజీవనం మొదలు పెట్టాడు..అంతేకాదు ఇద్దరు కలిసి ‘మళ్లీ పెళ్లి ‘ అనే సినిమాను కూడా తీశారు.. ఆ సినిమా ఇటీవల విడుదలయ్యి మిశ్రమ టాక్ ను అందుకుంది.. ఇక వీరిద్దరూ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనేది…

CINEMATELANGANA

భగత్ సింగ్ ని కాదు భగవంతుడిని.

‘నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది’, ‘నేను ఆకాశం లాంటోడిని’, ‘పాపులారిటీ ఏముందిలే అది పాసింగ్ క్లౌడ్ లాటింది’, ‘నేను ట్రెండ్ ఫాలో అవ్వను, సెట్ చేస్తా’, ‘నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ’, ‘అరే సాంబ రాస్కో రా’… ఇవి శాంపిల్ మాత్రమే ఇలాంటి డైలాగులని గబ్బర్ సింగ్ సినిమాలో దర్శకుడు హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ తో బుల్లెట్స్ లా మాటాడించాడు.

TELANGANA

తెలంగాణ బీసీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాల పరీక్ష ఫలితాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని బీసీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి గంగుల కమలాకర్ సోమవారం ఈ ఫలితాలను విడుదల చేశారు. ఎంపీసీలో సిద్దిపేట జిల్లాకు చెందిన పీ జ్యోత్స్న 122 మార్కులతో తొలి ర్యాంక్ సాధించింది. బైపీసీలో నల్గొండ జిల్లాకు చెందిన పీ శ్రీవల్లి 108 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. సీఈసీలో పెద్దపల్లి జిల్లాకు చెందిన కే సాయి సంహిత 107 మార్కులతో, ఎంఈసీలో మేడ్చల్ జిల్లాకు చెందిన…

National

నవీన్ పట్నాయక్: ఒడిషా అభివృద్ధిలో కీలక పాత్ర వహించిన సూపర్ సీఎం

భువనేశ్వర్: ఈరోజు ఒడిశా రాజకీయాలకే కాదు దేశానికి కూడా ముఖ్యమైన రోజు. నవీన్ పట్నాయక్, దేశం యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన మాస్ లీడర్, 2019 లో ఒడిశా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించారు మరియు అదే రోజున 5వ సారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఎన్నికల వాగ్దానాలన్నింటినీ నెరవేర్చిన ఆయన ఇప్పుడు 5వ దఫా పాలనకు 4 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెంది కొత్త శకానికి చేరుకుంది. 20…

National

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో సంచలన విషయాలు: బ్లూటూత్‌తో పరీక్ష రాశారు, నలుగురి అరెస్ట్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా మరో నలుగురిని ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) అరెస్ట్ చేసింది. వరంగల్ విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజినీర్(డీఈ) రమేష్ తోపాటు ప్రశాంత్, మహేశ్, నవీన్ అరెస్ట్ అయినవారిలో ఉన్నారు. ఏఈఈ, డీఏవో పరీక్షకు సంబంధించిన 25 ప్రశ్నపత్రాలను డీఈ రమేష్ విక్రయించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఏఈఈ పరీక్షలో ఏడుగురు అభ్యర్థులకు పరీక్ష హాల్‌లోకి ఎలక్ట్రానిక్…

TELANGANA

ఎమ్మెల్యే రఘునందన్ రావుకు ఐఆర్‌బీ లీగల్ నోటీసులు: రూ. 1000 కోట్ల పరువు నష్టం దావా

హైదరాబాద్: బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు ఐఆర్‌బీ(IRB) సంస్థ లీగల్ నోటీసులు జారీ చేసింది. రూ. 1000 కోట్లకు పరువు నష్టం దావా వేస్తూ ఐఆర్‌బీ సంస్థ రఘునందన్ రావుకు సోమవారం లీగల్ నోటీసులు పంపింది. ఔటర్ రింగ్ రోడ్డు టోల్ కాంట్రాక్టును హెచ్ఎండీఏ సంస్థ ఐఆర్‌బీ సంస్థకు లీజుకు ఇచ్చింది. అయితే ఈ టెండర్ కేటాయింపులో అక్రమాలు జరిగాయని.. ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. నిబంధనలను తుంగలో తొక్కి హెచ్ఎండీఏ.. ఐఆర్‌బీ సంస్థకు…

TELANGANA

దశాబ్ది ఉత్సవాలపై కేసీఆర్ సమీక్ష: అమరుల స్మారకం ముందు తెలంగాణ తల్లి విగ్రహం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులను మరోసారి ఆదేశించారు. ఇటీవల సచివాలయంలో కలెక్టర్ల సమావేశం నిర్వహించిన తర్వాత ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించిన పురోగతి గురించి డా. బిఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూన్ రెండు నుంచి రోజూ వారీగా నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాలకు సంబంధించి ఆయా శాఖలు తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

National

డీకే ఆపరేషన్ తెలంగాణ, కీలక ప్రతిపాదన – రేవంత్ కు షాక్..!?

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కర్ణాటక ఎన్నికల తరువాత కాంగ్రెస్ ఆపరేషన్ తెలంగాణ ప్రారంభించింది. కొత్త పాత్తుల దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా వైఎస్సార్ కుమార్తె షర్మిలతో మంతనాలు మొదలయ్యాయి. ఇప్పటికే ప్రియాంక గాంధీ – షర్మిల మధ్య ఫోన్ లో మంతనాలు జరిగాయని తెలుస్తోంది. ఇప్పుడు వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన డీకే శివకుమార్ రంగంలో కి దిగారు. షర్మిలను ఒప్పించే ప్రయత్నాలు జరుగున్నాయి. ఇదే సమయంలో రేవంత్ కు పార్టీ ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.…