4news HD TV

AP

చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి. నమ్మకం

టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నేడు. రాజకీయాలలో ఆయనది విలక్షణ శైలి. రాజకీయాలంటే పదవులు, అధికారం అనుభవించడం కాదని, అభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం పనిచేయడమని భావించే వ్యక్తి చంద్రబాబు నాయుడు. సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాష్ట్ర విభజన తర్వాత మళ్ళీ ఏపీకి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఆయన తన ఆలోచనలను ఆచరణలో పెట్టి చూపారు. ఆయన సమర్దతకు హైదరాబాద్‌ అతిపెద్ద నిదర్శనంగా కనిపిస్తోంది. చేతిలో చెల్లిగవ్వలేని పరిస్థితిలో ఏపీలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు…

AP

చంద్రబాబుకి విజయసాయి శుభాకాంక్షలు. వైసీపీలో మరో బ్లాస్ట్?

రాజకీయాలలో పదవులు, అధికారం ఎన్నడూ శాస్వితం కావనే విషయం అధికారంలో ఉండి చక్రం తిప్పుతున్నప్పుడు చాలా మంది గ్రహించరు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా వారిలో ఒకరు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సిఎం జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటివాడుగా చలామణి అయ్యారు. ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో చక్రం తిప్పుతూ ఓ వెలుగువెలిగారు. ఆ ఊపులోనే ఆయన చంద్రబాబు నాయుడుని, టిడిపిని అనరాని మాటలు చాలానే అన్నారు. సోషల్ మీడియాలో వేసిన సెటైర్లకు అంతే…

AP

వివేకా హత్యకేసులో మరో ట్విస్ట్. పాపం అవినాష్ రెడ్డి!

జగన్ ప్రభుత్వం తలుచుకొని ఉంటే వివేకానంద రెడ్డి హత్య కేసును నాలుగు వారాలలో తేల్చేసేది. కానీ దానిలో అందరూ అసమదీయులే కావడంతో నాలుగేళ్ళయినా తేల్చనీయలేదు. ఇదే మాట సీబీఐ న్యాయవాది మొన్న హైకోర్టులో కూడా చెప్పారు. ఏప్రిల్ నెలాఖరులోగా ఈ కేసు విచారణ పూర్తిచేయాలని సుప్రీంకోర్టు తమని ఆదేశించిందని, కానీ అవినాష్ రెడ్డిని ఎప్పుడు విచారణకు పిలిచినా కోర్టులో పిటిషన్లు వేస్తూ విచారణ ముందుకు సాగకుండా అడ్డుకొంటున్నారని కుండబద్దలు కొట్టిన్నట్లు చెప్పింది. సీబీఐ వాదనలు సహేతుకంగా ఉండటంతో…

AP

టిడిపితో కలవకుండా పవన్‌ కళ్యాణ్‌కి బ్రేకులు వేస్తున్నదెవరంటే.

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఈసారి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చాలా పట్టుదలగా ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ప్రయత్నిస్తానని అందుకోసం టిడిపితో కలిసి పనిచేసేందుకు సిద్దమని కూడా ప్రకటించారు. అయితే ఇటీవల ఢిల్లీలో బిజెపి పెద్దలను కలిసిన తర్వాత ఏపీలో బిజెపితో కలిసి పనిచేస్తానని ప్రకటించారు. పవన్ పొడ అంటే గిట్టని ఏపీ బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజు కూడా సై అన్నారు. మళ్ళీ ఎప్పటిలాగే రెండు పార్టీలు…

AP

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కధ అలా ముగించారు కేసీఆర్‌?

ఏపీలో రాజకీయపార్టీలకు దేని సమస్యలు దానికి, దేని లెక్కలు దానికీ ఉన్నందున కేంద్ర ప్రభుత్వం వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ని అమ్మకానికి పెట్టినా అన్నీ మొక్కుబడిగానే నిరసనలు తెలిపి ఊరుకొన్నాయి. కానీ ఎప్పుడైతే తెలంగాణ సిఎం కేసీఆర్‌ మీకు చేతకానిది నేను చేసి చూపించి వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కాపాడుతానంటూ హడావుడి చేయడం మొదలుపెట్టారో అప్పుడే అన్ని పార్టీలకు వేడి పుట్టింది. ముఖ్యంగా అధికారంలో వైసీపీకి ఇది రాజకీయంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తుంది కనుక వెంటనే ఏపీ…

World

100 ప్రొఫెసర్‌, అడిషనల్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ

గువాహటి(guwahati)లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) ఉద్యోగ అవకాశాలను ప్రకటించింది. 100 ప్రొఫెసర్‌, అడిషనల్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ చేయబోతున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. బయో కెమిస్ట్రీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, నెఫ్రాలజీ, గైనకాలజీ, యూరాలజీ, మెడికల్‌ ఆంకాలజీ, పెడియాట్రిక్స్‌, సైకియాట్రీ, రేడియాలజీ, సర్జికల్‌ ఆంకాలజీ, న్యూరాలజీ, హెమటాలజీ, పాథాలజీ తదితర విభాగాల్లో ఈ పోస్టులను భరీ చేయబోతున్నారు. ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.…

AP

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఓ పక్క సీబీఐ విచారణ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఓ పక్క సీబీఐ విచారణ జరుపుతోంది. మరోపక్క పిటిషన్లు పడుతుంటే వాటిపై హైకోర్టు విచారణ జరుపుతూనే ఉంది. ఈ కేసులో నిందితులు కూడా మీడియా ముందుకు వచ్చి రకరకాల స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. ఇవి సరిపోవన్నట్లు, మళ్ళీ వారి తరపున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంత పత్రికలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇద్దరూ నిరపరాధులని ముందే తీర్పు ప్రకటించి సమాంతర విచారణ జరుపుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం…

AP

తాడేపల్లి టూ విశాఖ జగన్ ప్రయాణం ముగుస్తుందా?

సిఎం జగన్మోహన్ రెడ్డి బుదవారం శ్రీకాకుళం జిల్లాలో మూలపేటలో గ్రీన్ ఫీల్డ్ పోర్టుకి, నౌపాడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి, ఎచ్చెర్ల మండలంలో బుడగట్లపాలెంలో ఫిస్షింగ్ హార్బర్‌కి, హీరమండలంలో వంశధార ఎత్తిపోతల పదకాలకి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, రూ.4,362 కోట్లతో మూలపేట పోర్టు నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేస్తామని, మరో రూ.365 కోట్లతో బుడగట్లపాలెం తీరంలో ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామన్నారు. గత పాలకులు శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిని పట్టించుకోలేదని కానీ తన…

AP

ఆలూరు నియోజకవర్గంలో యువగళం 75వ రోజు పాదయాత్ర

టిడిపి యువనేత నారా లోకేష్‌ నేడు కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో యువగళం 75వ రోజు పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా దారిలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఈ జగన్‌ డ్రామా ట్రూప్ వివేకా హత్య కేసులో అడ్డంగా బుక్కయి రోజుకో కధ చెపుతూ మమ్మల్ని అరెస్ట్‌ చేయకండి బాబో. అంటూ హైకోర్టును వేడుకొంటోంది. అయితే ఈ డ్రామా ట్రూప్ మొట్టమొదటే చిన్న లాజిక్ మిస్ అయ్యింది. ఒకవేళ గత ఎన్నికలలో అవినాష్ రెడ్డినే అభ్యర్ధిగా నిలబెట్టాలని…

APTELANGANA

కేఏ పాల్-లక్ష్మినారాయణ. ఇదేం కాంబినేషన్‌?

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కరలేని వ్యక్తి. ఆయన చాలా కాలంగా రాజకీయాలలో ఉన్నప్పటికీ రాణించలేకపోయారు. కారణం అందరికీ తెలుసు. ఇక ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డిని అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైల్లో కూర్చోబెట్టిన వ్యక్తి సీబీఐ మాజీ జేడీ లక్షినారాయణ. మితభాషి, మంచి సమర్దుడు, నిజాయతీపరుడు, రాష్ట్రం బాగుకోసం పరితపిస్తున్న వ్యక్తిగా ఆంధ్రా ప్రజలకు తెలుసు. ఏ విషయంలోనైనా వీరిద్దరూ తూర్పు పడమరవంటివారే. కానీ వైజాగ్‌…