4news HD TV

TELANGANA

రీల్స్ చేసేవారికి బంపర్ ఆఫర్…ప్రత్యేకంగా రీల్స్ పోటీ..గెలిచిన వారికి లక్ష రూపాయలు…

సోషల్ మీడియా వచ్చాక ప్రజల జీవనవిధానమే మారిపోయింది. ఒక్కోరోజు కూడా వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం, యూట్యూబ్ లను వాడకుండా జనాలు ఉండలేకపోతున్నారు. కొంతమంది సొంతంగా యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. అలాగే ఇటీవల రీల్స్ హంగామా మొదలైంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ రీల్స్ హవా కూడా ఎక్కువగా నడుస్తోంది. వీటి ద్వారా ఏ విషయాన్నైనా ఒక్క నిమిషంలోనే చెప్పయవచ్చు. అలాగే వివిధ దృశ్యాలు చూపించవచ్చు. అందుకే ఈ మధ్య జనాలు…

TELANGANA

గ్రేటర్ పరిధిలో కుక్కల నియంత్రణకు సిఫార్స్ చేసిన 26 అంశాలలో 25 అంశాలు అమలు చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు..

గ్రేటర్ పరిధిలో కుక్కల నియంత్రణకు ఏర్పాటైన కమిటీ సభ్యులు సిఫార్స్ చేసిన 26 అంశాలలో 25 అంశాలు అమలు చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో జోనల్ కమిషనర్లు, శానిటేషన్ అడిషనల్ కమిషనర్, హైలెవల్ కమిటీ సభ్యులతో కలిసి మేయర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ…   ఆర్థికపరమైన అంశాలను కౌన్సిల్ లో తీర్మానం చేసి ప్రభుత్వ ఆమోదం కు పంపించడం జరుగుతుందని, మిగతా అంశాలు వెంటనే…

TELANGANA

తెలంగాణలో సంచలనం సృష్టించిన పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్‌ కేసులో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు..

తెలంగాణలో సంచలనం సృష్టించిన పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్‌ కేసులో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బుధవారం అర్ధరాత్రి కరీంనగర్‌లోని సంజయ్‌ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, బీజేపీ శ్రేణులకు తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. కాగా బండి సంజయ్‌ను హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా మంగ‌ళ‌వారం హిందీ పేప‌ర్ కాపీయింగ్ కేసులో…

AP

ఏపీలో గోవుల అక్రమ రవాణా హైకోర్టు లో విచారణ..

ఏపీలో గోవుల అక్రమ రవాణా, సంతలు నిలుపుదల చేయా లని దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిగింది. రాష్ట్రంలో లంపీ స్కిన్ వ్యాధి నివారణకు ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ కు హైకోర్టు ఆదేశాలిచ్చింది. కేంద్రం గెజిట్ కు విరుద్ధంగా ఫిట్ నెట్ సర్టిఫికెట్లు ఇస్తున్న వారిపై ఏం కేసులు నమోదు చేశారు తెలపాలని డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.   దేశంలో, రాష్ట్రంలో గోవులు, వివిధ జంతువులకు లంపీ…

AP

ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఉమ్మడి కృష్ణ జిల్లాలో చంద్రబాబు పర్యటన….

ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు తన దూకుడు పెంచారు. వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారు చంద్రబాబు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఉమ్మడి కృష్ణ జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. అసలే కృష్ణాజిల్లా రాజకీయం హాట్ హాట్ గా ఉంటుంది. అలాంటిది చంద్రబాబు కృష్ణా జిల్లా పర్యటన అనడంతో అంతటా ఉత్కంట నెలకొంది. మాజీ మంత్రి కొడాలి నాని కామెంట్లతో అసెంబ్లీకి రానంటూ సవాల్ విసిరాక తొలిసారిగా గుడివాడలో పర్యటించనున్నారు చంద్రబాబు. తొలిసారిగా నిమ్మకూరులో…

AP

ఏపీ లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు…

విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన ఉత్తర-దక్షిణ ద్రోణి/గాలులు కోత ఇప్పుడు జార్ఖండ్ నుంచి దక్షిణ అంతర్గత తమిళనాడు వరకు అంతర్గత ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తువద్ద కొనసాగుతున్నది. ఈ కారణంగా రాబోయే మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. ఒకట్రెండు చోట్ల మెరుపులు సంభవించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే మూడు రోజులకు వాతావరణ…

AP

వైసీపీని ఓడించడమే బీజేపీ జనసేన లక్ష్యం..–: పవన్ కల్యాణ్

బీజేపీ బడా నేతల్ని కలిసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ పలువురు నేతల్ని కలిశాక ఈ రోజు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ ఇంచార్జి మురళీధరన్ కూడా పాల్గొన్నారు. అయితే సమావేశం జరిగిన అనంతరం బయటకు వచ్చిన పవన్ కల్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలన నుంచి ఏపీని విముక్తి చేయాలనే అంశాలపై చర్చించామని తెలిపారు. వైసీపీని…

AP

2023–24 సంవత్సరానికి సంబంధించి ఏపీ ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్‌ను సీఎం జగన్‌ ఆవిష్కరించారు

2023–24 సంవత్సరానికి సంబంధించి ఏపీ ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్‌ 2023–24 ను రాష్ట్ర  సీఎం జగన్‌ ఆవిష్కరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సమాచార శాఖ కమిషనర్‌ తుమ్మా విజయ్‌కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 నెలల్లోనే వివిధ సంక్షేమ పథకాల ద్వారా 2,96,148.09 కోట్ల రూపాయలను లబ్ధిదారులకు అందించామన్నారు మంత్రి చెల్లుబోయిన. అనంతరం…

CINEMA

విధ్వంసానికి సిద్ధమైన ఎన్టీఆర్…

జూ. ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ సమయం రానే వచ్చేసింది. మార్చి 23వ తేదీన NTR30 లాంచ్ అవ్వగా.. ఈరోజు నుంచి షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా చిత్రబృందమే అధికారికంగా వెల్లడించింది. అంతేకాదు.. షూటింగ్‌లో పాల్గొనేందుకు ఒక భారీ సెట్‌లో అడుగిడిన ఎన్టీఆర్ వీడియోని కూడా ట్విటర్ మాధ్యమంగా షేర్ చేశారు. ఇంతకుముందు విడుదల చేసిన మోషన్ పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌నే ఈ వీడియోకి జత చేసి రిలీజ్ చేశారు. ఇందులో…

CINEMA

ఓవర్సీస్ లో ప్రభాస్ సలార్ భారీ బిజినెస్…

భారత చిత్రసీమలో రూపొందుతోన్న అత్యంత క్రేజీ ప్రాజెక్టుల్లో ‘సలార్’ ఒకటి. ‘కేజీఎఫ్’తో సరికొత్త సంచలనాలు సృష్టించిన ప్రశాంత్ నీల్ లాంటి మాస్ దర్శకుడితో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతులు కలపడంతో.. ఈ ప్రాజెక్ట్ కోసం యావత్ భారతీయులతో పాటు ఓవర్సీస్‌లో ఉన్న ఇండియన్స్ కూడా ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా? ఎప్పుడెప్పుడు థియేటర్లపై దండయాత్ర చేద్దామా? అని వెయిట్ చేస్తున్నారు. ఎటు చూసినా.. ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి.…