ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు
హైదరాబాద్: ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, పంజాగుట్టతోపాటు పలు ప్రాంతాల్లో పోలీసులు సోమవారం తనిఖీలు చేపట్టారు. దీంతో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీగా నగదు, బంగారం, ఇతర వస్తువులు పట్టుబడటంతో పోలీసులు సీజ్ చేశారు. ఎలాంటి రసీదు లేనివాటిని స్వాధీనం చేసుకుని.. కేసులు నమోదు చేస్తున్నారు. హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తారానగర్‌లో అక్రమంగా తరలిస్తున్న భారీగా బంగారాన్ని…

