News

TELANGANA

నకిలీ DSP నీ అరెస్ట్ చేసిన సూర్యాపేట పట్టణ పోలీసు..

ఉద్యోగాలు ఇప్పిస్థానని అమయాక యువత నుండి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ DSP. అరెస్ట్ చేసి 18 లక్షల నగదు, ఒక కారు, పోలీస్ యూనిఫాం, 2 డమ్మీ మ్యాన్ ప్యాక్ లు స్వాధీనం. జిల్లా పోలీసు కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ కే నరసింహ ఐపీఎస్ గారు. ఈ రోజు అనగా 10/3/2025 రోజున ఉదయం శ్రీ గ్రాండ్ హోటల్ నందు ఒక వ్యక్తి అనుమానాస్పదం…

SPORTS

రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్ పెట్టిన రోహిత్ శర్మ..

చాంపియన్స్ ట్రోఫీ అనంతరం వన్డేల నుంచి రోహిత్ శర్మ తప్పుకోబోతున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై రోహిత్ ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. గత రాత్రి న్యూజిలాండ్‌తో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించి కప్పును కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ రిటైర్మెంట్ వార్తలకు చెక్ పెట్టాడు.   తన భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి ప్రణాళికలు లేవని, కాబట్టి రిటైర్మెంట్‌కు సంబంధించి ఎలాంటి…

TELANGANA

మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ..

ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 20న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేనకు 1, బీజేపీకి 1 ఎమ్మెల్సీ స్థానం కేటాయించిన టీడీపీ… మిగిలిన 3 ఎమ్మెల్సీ స్థానాలకు నేడు అభ్యర్థులను ప్రకటించింది. బీదా రవిచంద్ర, కావలి గ్రీష్మ, బీటీ నాయుడులను టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. ఈ ముగ్గురిలో ఒకరు ఎస్సీ కాగా, ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు.   శ్రీకాకుళంకు చెందిన…

AP

జైలు నుంచే వైసీపీ నేతలతో బోరుగడ్డ కాన్ఫరెన్స్ కాల్స్..!

రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కోసం పోలీసుల వేట మొదలైంది. ప్రస్తుతం ఆయన తెలంగాణలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఎక్కడున్నాడనే దానిపై ఫోకస్ చేశారు పోలీసులు. తాజాగా తన హత్యకు కుట్ర జరుగుతోందని సంచనల వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ అనిల్ మాటల్లో ఏమైనా నిజముందా? లేక కొత్త డ్రామా మొదలుపెట్టాడా? అన్నది అసలు పాయింట్.   బోరుగడ్డ అనిల్ ఎక్కడ?   రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ గురించి చెప్పనక్కర్లేదు. వైసీపీ ప్రభుత్వంలో ఓ రేంజ్‌లో రెచ్చిపోయాడు.…

TELANGANA

రాములమ్మకు MLC పదవి..?

తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థులు పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లు ఖరారయ్యాయి. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మహిళ అభ్యర్థికి కాంగ్రెస్ హైకమాండ్ అవకాశం ఇచ్చింది. అయితే ఊహించని విధంగా విజయశాంతి పేరు తెర పైకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇంఛార్జి థాక్రె హామీ ఇచ్చిన నేపథ్యంలోనే విజయశాంతికి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఓ సీటును సీపీఐకి కాంగ్రెస్ ఇచ్చిన విషయం తెలిసిందే.   ఐతే,…

TELANGANA

అనాథ యువతికి పెళ్లి చేసిన కలెక్టర్..! అధికారులే ఆత్మబంధువులు

సర్కారు బాలసదన్‌లో ఆశ్రయం పొంది పెళ్లీడుకు వచ్చిన ఓ అనాథ యువతికి.. ప్రభుత్వ అధికారులే దగ్గరుండి కరీంనగర్‌ కళాభారతిలో పెళ్లి జరిపించారు. అమ్మనాన్నల బాధ్యత తీసుకుని పుస్తెలు, మెట్టెలు సహా అనేక కానుకలు అందించారు. కలెక్టర్ పమేలా సత్పతి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ.ఇతర ప్రభుత్వ అధికారులు హాజరై నవదంపతులను ఆశీర్వదించారు. భవిష్యత్తులో ఈ దంపతులకు సర్కారే అండగా ఉంటుందని.. తల్లిదండ్రుల పాత్రను తామే తీసుకుంటామన్నారు అధికారులు.   పూజ అలియాస్ మౌనిక.. చిన్నతనంలో ఉండగానే తల్లిదండ్రులిద్దరూ…

TELANGANA

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ కు జై కొట్టేందుకు జనం సిద్ధంగా ఉన్నారు: కేసీఆర్..

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు ఎర్రవెల్లి ఫాంహౌస్ లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. వారికి భవిష్యత్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజలు ఇవాళ కష్టాల్లో ఉన్నారని, కాంగ్రెస్ హామీలు నమ్మి మోసపోయి గోసపడుతున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిజస్వరూపం ఏంటో ప్రజలకు అర్థమైందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ కు జై కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ స్పష్టం చేశారు.   బీఆర్ఎస్… తెలంగాణ ప్రజలు నిర్మించుకున్న రాజకీయ అస్తిత్వ పార్టీ అని స్పష్టం చేశారు. నేడు…

SPORTS

రేపే చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌… భారత్ vs న్యూజిలాండ్..

చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రేపు దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, మ్యాచ్ జరిగే పిచ్‌ ఎలా ఉండబోతోందన్న దానిపై రెండుమూడు రోజులుగా పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా, దీనిపై ఒక స్పష్టత వచ్చేసింది. ‘బ్రాండ్ న్యూ’ పిచ్‌పై కాకుండా ‘సెమీ-ప్రెష్’ పిచ్‌ను సిద్ధం చేసినట్టు తెలిసింది.   రెండువారాల క్రితం అంటే ఫిబ్రవరి 23న ఈ పిచ్‌ను గ్రూప్ స్టేజ్‌లో…

TELANGANA

ఆర్టీసీలో మహిళా సంఘాల అద్దె బస్సులు… నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేడు (మార్చి 8) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో పలు పథకాలను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో తీసుకువచ్చిన ఇందిరా మహిళా శక్తి మిషన్ ను ఆవిష్కరించనున్నారు.   డ్వాక్రా సంఘాల సోలార్ విద్యుత్ ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. తద్వారా 32 జిల్లాల్లో 64…

AP

బెయిలుపై బయటకు వచ్చి.. అజ్ఞాతంలోకి వెళ్లిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్..

తల్లి అనారోగ్యంతో బాధపడుతోందంటూ తప్పుడు మెడికల్ సర్టిఫికెట్‌తో మధ్యంతర బెయిలు పొందిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. గుంటూరు రాజేంద్రనగర్‌, వేళాంగిణి నగర్‌లో ఆయన ఇళ్లకు వెళ్లి చూడగా తాళాలు దర్శనమిచ్చాయి. ఆయన కుటుంబ సభ్యులు కూడా అందుబాటులో లేకపోవడం, ఫోన్లు స్విచ్చాఫ్ వస్తుండటంతో వారి ఆచూకీ కోసం పోలీసు గాలిస్తున్నారు.   తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్, వారి…