News

AP

ఎమ్మెల్సీ ఎన్నికలు.. నామినేషన్ వేయనున్న నాగబాబు..

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన నేత కొణిదెల నాగబాబు కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ జనసేన పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు గురువారం సాయంత్రం సంతకాలు చేశారు. నాదెండ్ల మనోహర్, పంచకర్ల రమేశ్ బాబు, పత్సమట్ల ధర్మరాజు, లోకం మాధవి, ఆరణి శ్రీనివాసులు, మండలి బుద్ధ ప్రసాద్, విజయ్ కుమార్, బత్తుల రామకృష్ణ, పంతం నానాజీ, ఆరవ శ్రీధర్ సంతకాలు చేశారు. నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఆయనను మంత్రివర్గంలోకి తీసుకునే…

TELANGANA

ఒంటిపూట బడులపై సర్కార్ కీలక నిర్ణయం..! ఎప్పటినుండి అంటే..?

ఎండల తీవ్రత పెరుగుతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో, ఒంటి పూట బడుల నిర్వహణ పైన విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. గతం కంటే ముందుగానే ఏడాది ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్లల్లో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విద్యా శాఖ అధికారులు వచ్చే విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్ ఖరారు చేసారు. అయితే, ఎండల తీవ్రత నేపథ్యంలో ఒంటిపూట బడుల పైన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పాఠశాలల నిర్వహణ సమయాలను ఖరారు…

TELANGANA

నేడు రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ..

ఈరోజు తెలంగాణ కేబినేట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడానికి అవసరమైన బిల్లులను ఈ సమావేశంలో ఆమోదిస్తారు. అలాగే బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను పెంచే బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే తేది, బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీలను ఖరారు చేయనున్నారు. టూరిజం పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. వీటితో పాటు పలు అంశాలకు…

CINEMANational

14 కిలోల బంగారంతో పట్టుబడిన కన్నడ నటి…

బంగారం అక్రమ రవాణా కేసులో కన్నడ హీరోయిన్ రన్యారావును బెంగళూరు విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఆమె నుంచి 14 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆమె తను సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్తెనని చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయినప్పటికీ పోలీసులు ఆమెపై అక్రమ బంగారం రవాణా కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.   సీనియర్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత కర్ణాటక పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ డీజీ డాక్టర్ కె రామచంద్రరావు…

AP

సైకో జగన్ మాటలు ప్రజలు నమ్మొద్దు: మంత్రి నారాయణ..

ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మండిపడ్డారు. సైకో జగన్ మాటలు ప్రజలు నమ్మొద్దని సూచించారు. అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు. రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రజలపై ఒక్క పైసా భారం ఉండదని మంత్రి నారాయణ స్పష్టంచేశారు.   ప్రపంచంలోని టాప్-5 సిటీల్లో అమరావతిని నిలబెట్టడమే చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాజధానికి సంబంధించి రూ.64…

AP

గుంటూరులో దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదు..

వైసీపీ నేతలను కేసులు వెంటాడుతున్నాయి. కూటమి ప్రభుత్వ పెద్దలు మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతోందంటున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదైంది. పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై గుంటూరు నగరంపాలెం పీఎస్ లో దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదు చేశారు. జనసేన నాయకుడు అడపా మాణిక్యాలరావు ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు.   అటు, ఇదే అంశంపై విజయనగరంలోనూ దువ్వాడపై ఫిర్యాదు…

AP

తనకు లేని అధికారాన్ని జగన్ కోరుకుంటున్నారు : నాదెండ్ల..

AP : ప్రతిపక్ష హోదాపై YCP నేతలు కావాలనే బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. జగన్ తనకు లేని అధికారాన్ని కోరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు గౌరవం ఇవ్వకుండా ఛీ కొట్టినప్పుడు హోదా ఇవ్వాలని ఎలా కోరుకుంటారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ప్రచార మాధ్యమాల్లో చేస్తున్న దుష్ప్రచారంపై సభా హక్కుల సంఘానికి నివేదించాలని జనసేన తరఫున కోరుతున్నట్లు తెలిపారు.

TELANGANA

SLBC టన్నెల్‌లో సహాయక చర్యలకు మళ్ళీ ఆటంకం..

SLBC టన్నెల్ అప్డేట్ : SLBC టన్నెల్‌లో సహాయక చర్యలకు మళ్ళీ ఆటంకం నిన్న కన్వేయర్‌ బెల్ట్‌ పనిచేయడంతో సహాయక చర్యలు వేగవంతం అయ్యాయి. కానీ ఈరోజు కన్వేయర్ బెల్ట్ మళ్ళీ పని చేయకపోవడంతో సహాయక చర్యలు తిరిగి ఆగిపోయాయి   దీంతో శిథిలాలు బయటకు తొలగించడంలో మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది   టన్నెల్‌లో చిక్కుకున్న తమ వారు తిరిగి వస్తారని నమ్మకం లేక, నిరాశతో సొంత ఊర్లకు తిరిగి వెళ్తున్న బాధితుల కుటుంబ సభ్యులు

TELANGANA

బీసీ వాదాన్ని గ్రామగ్రామానికి తీసుకెళ్తాం: మల్లన్న..

TG: బీసీ వాదాన్ని గ్రామగ్రామానికి తీసుకువెళ్తామని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పేర్కొన్నారు. మీడియాతో ఆయన మాట్లాడారు. బీసీవాదం తెలంగాణలో బలపడ్డ సూచనలు కనిపిస్తున్నాయన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ.. అధికార పార్టీ నేతలను వెనక్కి లాగేంత బలమైన శక్తిగా మారారని చెప్పారు. కులగణన లెక్కలు తప్పని నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

National

అసెంబ్లీలోనే పాన్ మసాలా ఉమ్మేసిన ఎమ్మెల్యే..! ఎక్కడంటే..?

పరిసరాల పరిశుభ్రత ఎలాగూ పాటించని నేతలున్న దేశం మనది… అలాంటిది చట్టాలు చేసే సభలను అయినా గౌరవంగా చూసుకోవాల్సి ఉంటుంది. అక్కడ పరిశుభ్రత పాటించడం అంటే కోట్ల మంది ప్రజలకు సందేశాన్ని ఇస్తున్నట్లే.. కానీ, బుద్ధిలేని ఓ ఎమ్మెల్యే ఏకంగా చట్టసభలోనే పాన్ నమిలి ఉమ్మేశాడు. సభ అనుకున్నారో లేక తానుండే ఇళ్లు అనుకున్నారో కానీ కనీసం ఆలోచన లేకుండా.. విధాన సభ ఎంట్రీ దగ్గర పాన్ నమిలి ఉమ్మేసి.. చట్టం గురించి, ప్రజల గురించి చర్చించేందుకు…