News

Uncategorized

వాట్సాప్ ద్వారా 161 రకాల సేవలు… చంద్రబాబు సమీక్ష..

వాట్సాప్ గవర్నెన్స్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రభుత్వం రేపటి నుంచి అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో సీఎం సమీక్షించారు. రేపు (జనవరి 30) వాట్సాప్ గవర్నెన్స్‌ సేవలను ఐటీ, విద్యా శాఖా మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ సమీక్షలో సీఎస్ కె.విజయానంద్‌తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   మొదటి విడతగా పౌరులకు 161 రకాల సేవలను ప్రభుత్వం వాట్సాప్ ద్వారా అందించనుంది. ఈ మేరకు…

AP

ఆ ఛానెళ్లపై కేసు నమోదు.. లైసెన్స్ లను రద్దు చేయాలని టీటీడీ ఫిర్యాదు..

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తొలిసారి తన పవర్ చూపించారు. తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లేలా ఎవరు ప్రవర్తించినా చర్యలు తీసుకుంటామని పలుమార్లు చైర్మన్ హెచ్చరించారు. కానీ కొందరు అదే రీతిలో ప్రవర్తిస్తున్నట్లు గుర్తించిన టీటీడీ చర్యలకు ఉపక్రమించింది. మున్ముందు ఇలాంటి దుష్ప్రచారం ఎవరూ సాగించకుండ ఉండేందుకు చర్యలు తీసుకున్నట్లు చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. ఇంతకు అసలేం జరిగిందంటే..   ఇటీవల చాగంటి కోటేశ్వరరావు తిరుమలకు వచ్చిన సమయంలో, చాగంటికి అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో…

TELANGANA

స్థానిక సంస్థల ఎన్నికల సమరం..? ఫస్ట్ వీక్‌లో ఎన్నికలపై క్లారిటీ..

స్థానిక సంస్థల ఎన్నికలపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టిందా? వచ్చేవారం రిపోర్టు కేబినెట్ సబ్ కమిటీ ముందుకు రానుందా? రాష్ట్రంలో 55 శాతం బీసీలు ఉన్నట్లు తేలిందా? రిజర్వేషన్లు పెంపుపై లీగల్ ఒపీనియన్‌కు సిద్ధమవుతుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.   తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన దాదాపు పూర్తి అయ్యింది. డేటా ఎంట్రీ పూర్తి కావడంతో మరో రెండురోజుల్లో ముసాయిదా నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్‌లో సర్వేపై అధికారులు,…

TELANGANA

వరల్డ్ క్లాస్ టెక్నాలజితో ఉస్మానియా కొత్త ఆసుపత్రి.. 31న శంకుస్థాపన..

అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక టెక్నాలజీతో రానుంది కొత్త ఉస్మానియా హాస్పిటల్‌. వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. డిజైన్లు దాదాపు ఖరారు కావడంతో శుక్రవారం (జనవరి 31)న నూతన భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ విషయాన్ని స్వయంగా ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.   ఉస్మానియా హాస్పిటల్ నూతన భవనాల డిజైన్లపై బుధవారం ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. దీనికి ఆరోగ్య, ఆర్ అండ్…

TELANGANA

అధికారులను ప్యాలెస్ కు పిలిపించుకుని అహం ప్రదర్శిస్తున్నావు.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్ రావు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజాపాలన అన్నావని, సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ అన్నావని, ప్రజలను ప్రతిరోజు కలుస్తా అన్నావని… కానీ ఏడాది కాలంగా ప్రజలకు ముఖం చాటేశావని హరీశ్ మండిపడ్డారు. జూబ్లీహిల్స్ లోని ప్యాలెస్ నుంచి లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పాలన కొనసాగిస్తున్నావని దుయ్యబట్టారు.   ముఖ్యమంత్రి, మంత్రులు, అన్ని శాఖలు, విభాగాలు ఒకే చోట ఉండే సువిశాలమైన…

TELANGANA

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు.. వెలుగులోకి మరిన్ని దారుణాలు..!

తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఫోన్‌ను ట్యాప్ చేసిన విషయం ఇటీవల బయటపడి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ విషయం మరువక ముందే, ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు తాజాగా వెల్లడైంది. వీరిలో ఒక మహిళా న్యాయమూర్తి కూడా ఉన్నారు. తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు నేతృత్వంలోని ముఠాలోని కీలక…

National

ఒలింపిక్స్ నిర్వహణపై ప్రధాని మోదీ వివరణ.. 2036 లో..

ఒలింపిక్స్ క్రీడల నిర్వహణకు సంబంధించి ప్రధానమంత్రి మోదీ కీలక ప్రకటన చేశారు. 38వ జాతీయ క్రీడలను డెహ్రాడూన్‌లో ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఒలింపిక్స్ వల్ల అనేక రంగాల్లో విస్తృత అవకాశాలు వస్తాయని అన్నారు.   భారత్‌లో 2036 ఒలింపిక్స్ నిర్వహణ హక్కుల కోసం తాము విశ్వప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఇవి కేవలం క్రీడలకే పరిమితం కాదని, ఇవి జరిగిన ప్రదేశాలలో అన్ని రంగాలు లాభపడతాయని ఆయన అన్నారు. ఒలింపిక్స్ నిర్వహణతో…

AP

ఏపీలో ఇకపై బడుల్లో ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’..

ఏపీ మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై బడుల్లో ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి.. పాఠశాలల్లో కో-కరికులమ్ కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు. ఇందులో భాగంగా ప్రతి శనివారం బ్యాగుల బరువు నుంచి విద్యార్థులకు విముక్తి కల్పించాలని, ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’ నిర్వహించాలని సూచించారు.   అలాగే, ఉపాధ్యాయులకు ఇప్పుడున్న పలు యాప్‌ల స్థానంలో ఒకే…

AP

రైలు పట్టాలపై పడుకోబెడతా.. వారికి ఎమ్మెల్యే గుమ్మనూరు వార్నింగ్..

తనపై కొందరు మీడియా ప్రతినిధులు తప్పుడు ఆరోపణలు చేస్తూ వార్తలు రాస్తున్నారని మాజీ మంత్రి, గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మండిపడ్డారు. నిరూపించే దమ్ము ఉంటేనే వార్తలు రాయాలని… నిరూపించలేకపోతే రైలు పట్టాలపై పడుకోబెడతానని హెచ్చరించారు. ఎవడో డబ్బులు ఇస్తాడని తప్పుడు వార్తలు రాస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాను భూకబ్జాలకు పాల్పడ్డానని, నియోజకవర్గంలో తన కుటుంబ పెత్తనం ఉందంటూ కొందరు తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని… వారంతా పద్ధతి మార్చుకోవాలని అన్నారు.…

National

కైలాస మానస సరోవర యాత్ర పునరుద్ధరణకు భారత్-చైనా అంగీకారం..

2020లో కరోనా సమయంలో నిలిచిపోయిన కైలాస మానస సరోవర యాత్రను పునరుద్ధరించేందుకు భారత్-చైనా దేశాలు అంగీకరించాయి. అలాగే, ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు కూడా తిరిగి ప్రారంభం కానున్నాయి. విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో ఇరు దేశాల మధ్య రెండ్రోజుల పాటు జరిగిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చర్చల కోసం భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ బీజింగ్‌లో పర్యటించారు.   భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య అక్టోబర్‌లో రష్యాలోని…