వాటికి నిధులివ్వండి కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు వినతి..!
ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీ బిజీగా గడుపుతున్నారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుక్ మాండవీయతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సహకరించాలని ఆయన కోరారు. ఏపీలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం.. అమరావతిలో జాతీయ జల క్రీడల శిక్షణా హబ్ ఏర్పాటుకు అవకాశం ఉందని మాండవీయ దృష్టికి తీసుకెళ్లారు. కృష్ణా నదీ తీరంలో వాటర్ స్పోర్ట్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు…