News

TELANGANA

తెలంగాణకు మారిన గుదిబండలా కాళేశ్వరం..!

తెలంగాణకు కాళేశ్వరం గుదిబండలా మారింది. ఈ ప్రాజెక్టు వల్ల ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం వందల కోట్లు ఖర్చవుతున్నాయి. కాళేశ్వరంలోని అన్ని పంపులు నడిపితే ఏటా రూ.936.97 కోట్ల కరెంట్బిల్లులు చెల్లించాల్సి ఉంటుందని ఇంజినీరింగ్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులో ఒక్క మోటారు నడిచినా, నడువకున్నా ఏటా ఫిక్స్ డ్ ఛాచార్జీల రూపేణ రూ.1,337.59 కోట్లు చెల్లించి తీరాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తెచ్చిన లోన్ల రీపేమెంట్, కరెంట్బిల్లులు, ప్రాజెక్టు ఆపరేషన్అండ్మెయింటనెన్స్కు వెచ్చించే మొత్తాన్ని…

TELANGANA

రికార్డ్ కలెక్షన్స్.. ఒక్క రోజే 52.78 లక్షల మంది ప్రయాణం..

సంక్రాంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) బస్సులలో లక్షల సంఖ్యలో ప్రజలు ప్రయాణిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో నిన్న ఒక్క రోజే 1861 ప్రత్యేక బస్సులను వివిధ ప్రాంతాలకు సంస్థ నడిపింది. అందులో 1127 హైదరాబాద్‌ సిటీ బస్సులను ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న కరీంనగర్‌, వరంగల్, విజయవాడ, ఖమ్మం, తదితర రూట్లలో తిప్పారు.   సంక్రాంతి సందర్బంగా 4484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని సంస్థ ప్లాన్‌ చేయగా.. ప్రయాణికుల…

National

22న మద్యం దుకాణాలు, బార్‌లు బంద్‌..

ఈ నెల 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరంలో శ్రీరాముని ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠాదినమైన జనవరి 22న రాష్ట్రంలోని మద్యం దుకాణాలు, బార్లు బంద్ పాటించాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ బంద్ పాటించాలని ఉత్తరాఖండ్ ఎక్సైజ్ కమిషనర్ హరిచంద్ర తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

AP

వైసీపీకి ఎంపీ బాలశౌరి రాజీనామా.. జనసేనలోకి ఎంట్రీ ఖరారు..!

అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మరో కీలక నేత గుడ్‌బై చెప్పారు. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి వైయస్సార్సీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపినట్లు ఎంపీ బాలశౌరి తెలిపారు. తనకు రెండోసారి పోటీకి వైసీపీ అవకాశం ఇవ్వడం లేదన్న సమాచారంతో మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.   తనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని అసంతృప్తితో ఉన్న బాలశౌరి గత కొంత కాలంగా పార్టీ…

AP

టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ఖరార్..డజను హామీలు

సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పలు లోక్‌సభ/అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇన్‌‌ఛార్జీలను ప్రకటిస్తూ దూకుడు మీద ఉంది.   పలు అంశాలు..   సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం- జనసేన పార్టీలు సాగిస్తోన్న కసరత్తు కూడా దాదాపుగా ముగింపుదశకు చేరుకుంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాతే ఈ జాబితాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాయి. దీనికి సమాంతరంగా-…

TELANGANA

ఆటో డ్రైవర్లకు రూ. 15 వేల భృతి ఇవ్వాలంటూ హరీశ్ రావు డిమాండ్..

కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులను రోడ్డన పడేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచి కార్యక్రమమే అయినా.. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించడం అంతే ముఖ్యమని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణాలతో ఆటో కార్మికులు తమ కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉన్నారన్నారు.   అంతేగాక, ఆటో డ్రైవర్లకు ప్రతి నెల రూ.15 వేల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా డిగ్రీ…

TELANGANA

హైదరాబాద్-విజయవాడ పారిశ్రామిక కారిడార్.. కేంద్ర మంత్రికి రేవంత్ కీలక ప్రతిపాదనలు

దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బిజీ బిజీగా గడుపుతున్నారు. ఓ వైపు కాంగ్రెస్ పెద్దలను కలుస్తూనే.. మరోవైపు కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక ప్రతిపాదనలు కేంద్రమంత్రి ముందుంచారు. హైద‌రాబాద్-విజ‌య‌వాడ వ‌యా మిర్యాల‌గూడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.…

National

చమురు ధరల భగ్గు.. 4% పెరుగుదల..

పశ్చిమదేశాలు, హౌతీ రెబెల్స్ దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఎర్ర సముద్రంలో వాణిజ్యనౌకలను హౌతీలు లక్ష్యంగా చేసుకుంటున్న నేపథ్యంలో చమురు సహా అన్ని సరుకుల రవాణాకు తీవ్ర విఘాతం కలిగింది. హౌతీలను నిలువరించే లక్ష్యంతో అమెరికా, బ్రిటన్ యెమెన్‌లో వారి స్థావరాలపై ప్రతి దాడులు చేశాయి. పశ్చిమదేశాల సైనిక చర్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు హూంకరిస్తున్నారు.   ఈ నేప్యథంలో కొత్త ఏడాదిలో తొలిసారిగా చమురు ధరలు 4% పెరిగాయి.…

AP

చంద్రబాబు ఇంటికి షర్మిల- దశాబ్దాల వైరంలో బిగ్ టర్న్..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు స్నేహితులుగా, ఆ తర్వాత రాజకీయ ప్రత్యర్ధులుగా హోరాహోరీగా తలపడిన వైఎస్, చంద్రబాబు ఎపిసోడ్ కు హెలికాఫ్టర్ ప్రమాదం తర్వాత తెరపడింది. దీనికి ముందు వైఎస్, చంద్రబాబు అసెంబ్లీ వేదికగా, బయటా చేసుకున్న విమర్శలు, టార్గెట్ చేసుకున్న తీరు ఏపీ రాజకీయాల్ని ఓ రేంజ్ లో వేడెక్కించేసింది. విభజన తర్వాత ఇప్పటికీ అసెంబ్లీలో వైఎస్, చంద్రబాబు స్ధాయి పోరు అధికార, విపక్షాల మధ్య కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు.   అలా గతంలో…

AP

రెబెల్ ఎంపీ రఘురామకు మరో షాక్..

ఏపీలో సంక్రాంతి వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటివరకు ఢిల్లీ హైదరాబాద్ కేంద్రంగా తన కార్యకలాపాలు నిర్వహిస్తూ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు. గతంలో రఘురామ కృష్ణం రాజును ఏపీ పోలీసులు సైతం అరెస్టు చేసి విచారణ చేసిన సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతి సందర్భంగా తన సొంతూరికి రావాలని భావిస్తున్న రఘురామ కృష్ణంరాజుపై ఏపీ పోలీసులు నిఘా పెట్టినట్లు సమాచారం. తనను ఓ అట్రాసిటీ కేసులో అరెస్టు…