News

TELANGANA

ఆడబిడ్డలకు అన్నలా,తమ్ముడిలా,మేనమామలా,కంటికి రెప్పలా మారిన కేసిఆర్.!సీఎంపై కవిత ప్రశంసలు.!

హైదరాబాద్: మహిళా సంక్షేమానికి సీఎం చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆడబిడ్డలను పైకి తీసుకురావాలన్న తపనతో సీఎం చంద్రశేఖర్ రావు అనేక పథకాలను అమలు చేస్తూ దేశానికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. మహిళా సంక్షేమానికి ఏ రాష్ట్రం చేయనన్ని పనులు తెలంగాణలో జరుగుతున్నాయని వివరించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరుపుకుంటున్న మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా మహిళాలోకానికి కవిత శుభాకాంక్షలు తెలిపారు. షీ టీమ్…

National

ఆహార భద్రత,సుస్థిర వ్యవసాయం లక్ష్యంగా జీ20 సమావేశాలు.!వివరాలు వెల్లడించిన కిషన్ రెడ్డి.!

హైదరాబాద్ : జీ20 సమావేశాలకు సంబంధించి హైదరాబాద్ లో ఈ నెల 15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు జీ20 అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్ జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశాలకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన కీలక అంశాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తారన్నారు. జీ20 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు, వ్యవసాయ శాఖ మంత్రులు ఈ సమ్మిట్ లో పాల్గొంటారన్నారని…

National

ఆగిపోయిన మహేష్ బాబు ‘గుంటూరు కారం’?

ఏ ముహూర్తాన గుంటూరు కారం సినిమాను ప్రారంభించారోకానీ అప్పటి నుంచి వాయిదాలు పడుతూనే ఉంది. అసలు పూర్తవుతుందో? లేదో? అనే సందేహాన్ని మహేష్ బాబు అభిమానులే వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వాయిదాలు పడుతూ, పడుతూ లేస్తూ షూటింగ్ జరుపుకుంటున్న గుంటూరు కారం షూటింగ్ మరోసారి వాయిదా పడింది. సహ నటుల కాల్షీట్లు ఇబ్బందికరంగా మారడంతో జూన్ మొదటివారంలోనే జరగాల్సిన షూటింగ్ 12వ తేదీకి వాయిదా పడింది. అయితే తాజాగా…

National

జగన్‌ సర్కార్‌పై కేంద్రం కనకవర్షం- మరో రూ.4,787 కోట్లు: తక్షణమే విడుదల

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి.. కేంద్రం కనకవర్గాన్ని కురిపిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వంతో ఎలాంటి ఘర్షణ వైఖరికి వెళ్లకుండా తనకు కావాల్సిన పనులన్నింటినీ జగన్ చేయించుకుంటోన్నారు. నిధులను తెప్పించుకుంటోన్నారు. మీ అభిమానం సల్లగుండ- పాలాభిషేకంతో తడిచి ముద్దయిన తెలంగాణ మంత్రి రెవెన్యూ లోటు బడ్జెట్ కింద కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రాష్ట్రానికి 10,461 కోట్ల రూపాయలను విడుదలను మంజూరు చేసిన…

CINEMANational

అబ్బురపరుస్తున్న అల్లు అర్జున్ AAA మల్టీప్లెక్స్

ఏషియన్ సినిమాస్‌తో కలిసి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ AAA సినిమాస్ మొదలు పెట్టబోతున్నారు. థియేటర్ పని మొత్తం పూర్తయింది. ఈనెల 15వ తేదీన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి అల్లు అర్జున్ సత్యం మల్టీప్లెక్స్ ప్రారంభించబోతున్నారు. అమీర్ పేటలోని సత్యం థియేటర్ అంటే ఎంతో ఫేమస్. దీన్ని సర్వ హంగులతో పునర్నిర్మించి AAA సత్యం మల్టీప్లెక్స్ గా ప్రారంభిస్తున్నారు. ఈ మల్టీప్లెక్స్ లో అనేక ప్రత్యేకతలున్నాయి. సీటింగ్, సౌండ్ సిస్టం, స్క్రీన్స్ వేటికవే…

National

‘తమిళనాడు ప్రధాని’ వ్యాఖ్యలపై స్టాలిన్ సెటైర్..

తమిళనాడులోని వేలూరులో తాజాగా పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా డీఎంకే ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. అలాగే డీఎంకే పార్టీని కూడా టార్గెట్ చేస్తూ బీజేపీ నేతల భేటీలో కీలకవ్యాఖ్యలు చేశారు. గతంలో తమిళనాడుకు చెందిన ఇద్దరు నేతల్ని ప్రధాని కాకుండా డీఎంకే అడ్డుకుందని ఆరోపిస్తూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దీనిపై తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యంగంగా స్పందించారు. భవిష్యత్తులో తమిళనాడుకు చెందిన ఎవరైనా ప్రధాని అయ్యేలా కృషి చేయాలని అమిత్ షా ఆదివారం తమిళనాడులోని తమ…

National

ఆధార్ కార్డ్ ఫ్రీగా అప్డేట్ చేసుకోవటానికి ఇంకా నాలుగురోజులే సమయం.. హర్రీఅప్!!

చాలామంది ఆధార్ కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీ సమాచారంలో తప్పులు ఉన్నట్లయితే వాటిని మార్చడానికి ప్రయత్నం చేస్తారు. ఆధార్ కార్డులో మార్పులకు రిజిస్టర్డ్ మీసేవ, ఈసేవ కేంద్రాలకు వెళ్లి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి 50 రూపాయలు డబ్బులు చెల్లించి మరీ చేసుకుంటారు.   అయితే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డులో తప్పులు ఉంటే వాటిని దిద్దుకోవడానికి వాటిని సరి చేసుకోవడానికి ఆన్లైన్ పోర్టల్లో జూన్ 14వ తేదీ వరకు ఉచితంగా…

National

అప్సర హత్య: పోస్టుమార్టం, రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు: అందుకే హత్య, నెట్‌లో సెర్చ్ చేసి..

హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యాయి. తాజాగా, ఉస్మానియా ఆస్పత్రిలో అప్సర మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. ఉస్మానియా ఫోరెన్సిక్ వైద్యుడు యాదయ్య బృందం పోస్టుమార్టం చేశారు. ప్రాథమిక నివేదికను వైద్యులు పోలీసులకు అందించారు. తలకు బలమైన గాయాలు కావడంతోనే అప్సర ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులకు వైద్యులు తెలిపారు. అనంతరం అప్సర మృతదేహాన్ని పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో వారు సరూర్‌నగర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. తమ కూతుర్ను దారుణంగా హత్య…

National

ఏపీలో 7 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు ? ఆ ఎంపీ సీటుతో పాటే- రఘురామ తాజా డిమాండ్….

ఏపీలో మరో 9 నెలల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. వీటిలో ఎలాగైనా గెలవాలని వైసీపీ, టీడీపీ పట్టుదలగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే ఫిరాయింపుల పర్వం కూడా ఊపందుకుంటోంది. ఇదే క్రమంలో వైసీపీ నుంచి టీడీపీకి, అలాగే టీడీపీ, జనసేన నుంచి వైసీపీకి ఎమ్మెల్యేలు ఫిరాయిస్తున్నారు. ఇలా ఎమ్మెల్యేలు ఫిరాయించిన 7 సీట్లలో ఉపఎన్నికలు పెట్టాలని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏడు అసెంబ్లీ…

TELANGANA

ఏపీ ఈఏపీసెట్ ఫలితాల తేదీ ఖరారు: ఎప్పుడంటే?, ఇలా తెలుసుకోండి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్(AP EAPCET) 2023 ఫలితాలు విడుదలకు తేదీ ఖరారైంది. జూన్ 14న ఉదయం 10.30 గంటలకు ఫలితాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేస్తారని ఏపీ ఈఏపీసెట్ ఛైర్మన్, అనంతపురం జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ జీ రంగ జనార్థన, కన్వీనర్ ప్రొఫెసర్ సీ శోభా బిందు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ ఫలితాల విడుదల కార్యక్రమానికి ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామల…