News

National

ఆర్వీ ఇంజినీరింగ్ పరిశ్రమలో భారీ పేలుడు: నలుగురికి తీవ్ర గాయాలు; ఖమ్మం మార్కెట్లో మంటలు

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో ఉన్న పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్వీ ఇంజినీరింగ్ పరిశ్రమలో పేలుడు సంభవించడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరందర్నీ పాటన్‌చెరులో ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. స్వల్పంగా గాయపడిన మరో వ్యక్తిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పాశమైలారం పారిశ్రామికవాడలో ఆర్వీ ఇంజినీరింగ్ పరిశ్రమ ఆవరణలోనే రెండు యూనిట్లు నడుపుతున్నారు. ఒకదానిలో ఆర్వీ ఇంజినీరింగ్…

TELANGANA

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ నిందితులకు హైకోర్టులో ఊరట

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట లభించింది. ప్రశ్నపత్రాల లీకేజీ నిందితులు గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇవ్వడంపై టీఎస్‌పీఎస్సీ అప్పీలు దాఖలు చేసింది. నలుగురు నిందితులను పరీక్షకు అనుమతించాలంటూ శుక్రవారం సింగిల్ జడ్జీ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ కమిషన్ అధికారులు హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శనివారం న్యాయమూర్తి ఇంట్లో జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి, జస్టిస్ ఎన్ రాజేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ…

NationalTELANGANA

ఖమ్మంలో అమిత్ షాతో బీజేపీ బలప్రదర్శన అందుకేనా?

ఖమ్మం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పొంగులేటి బీజేపీలో చేరక పోవడం వెనక స్థానికంగా బీజేపీకి బలం లేదని కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే ఇదే సమయంలో ఖమ్మంలో బీజేపీ తన సత్తా చాటాలని, బలప్రదర్శనకు రెడీ అయింది. ఖమ్మం వేదికగా బీజేపీ అగ్రనేత అమిత్ షా తో బహిరంగ సభను నిర్వహించి ఖమ్మంలో కమలం పార్టీ తన బలాన్ని…

National

పబ్‌లో ఊ అంటావా.. ఊఊ అంటావా మావా.. వరుణ్ ధావన్‌తో సమంత!!

టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న సమంత అటు సినిమాలతోనే కాకుండా, వెబ్ సిరీస్ లలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రాజ్, డీకే దర్శకత్వంలో సిటాడెల్ లో సమంత నటిస్తోంది. ఇందులో వరుణ్ ధావన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సమంత సిటాడెల్ కోసం విదేశాలలో ఉన్నారు. ప్రస్తుతం సెర్బియాలో హంగామా చేస్తున్నారు. మొన్నటికి మొన్న సెర్బియాలో రాష్ట్రపతిని కలిసిన సిటాడెల్ టీం ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అందరికీ తెలియజేశారు.…

CINEMA

మెక్ డొనాల్డ్స్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా jr.ntr.. పారితోషికం?

RRR సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ స్టార్ డమ్ అంతర్జాతీయస్థాయికి చేరింది. స్వాతంత్ర్య సమరయోధుడు కొమరం భీమ్ పాత్రలో జూనియర్ పలికించిన హావభావాలకు ప్రపంచంలోని వివిధ భాషల్లో ఉన్న సినీ ప్రముఖులతోపాటు సినీ ప్రేమికులు కూడా ఫిదా అయ్యారు. ఈ సినిమా తర్వాత తారక్ చేసే ప్రతి సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్టుగా చేసుకుంటూ వస్తున్నాడు. RRR సినిమాతో తారక్ పాపులారిటీ విపరీతంగా పెరిగింది. టాప్ బ్రాండ్ కంపెనీలన్నీ తమ బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోవడానికి పోటీపడుతున్నాయి. తాజాగా…

National

బీజేపీ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎం కొడుకు, రాజీనామాలు చేస్తామని !

ముంబాయి/న్యూఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలోని బీజేపీ-శివసేన కూటమికి ముప్పు తప్పదని కొందరు రాజకీయ నాయకులు అంచనా వేస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కుమారుడు, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు కూడా తమ ప్రవర్తన మార్చుకోకుంటే మహారాష్ట్ర ప్రభుత్వంలో మేము రాజీనామా చేస్తామని హెచ్చరించారు. ప్రియురాలిని 20 ముక్కలుగా నరికేశాడు, నాకు కూతురు లాంటిదని డ్రామాలు, హెచ్ఐవీ ! స్వార్థ రాజకీయాల కోసం…

National

వైసీపీ ఎమ్మెల్యే పార్ధసారధికి గుండెపోటు- హెల్త్ అప్ డేట్ ఇదే.

కృష్ణాజిల్లా పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి ఇవాళ గుండెపోటుకు గురయ్యారు. ఉదయం ఇంట్లో ఉన్న సమయంలోనే ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబసభ్యులు స్ధానిక ఆస్పత్రికి తరలించారు. వెంటనే అత్యవసర చికిత్స అందించిన డాక్టర్లు ఆయన ప్రాణం కాపాడారు. అనంతరం యాంజియోగ్రామ్ టెస్ట్ నిర్వహించి స్టెంట్ కూడా వేసినట్లు తెలుస్తోంది. స్టెంట్ వేసిన తర్వాత పార్ధసారధి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. దీంతో కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు ఊరట పొందారు. అంతకుముందు స్ధానికంగా…

NationalTELANGANA

కేసీఆర్ పేరును పచ్చబొట్టుగా వేయించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. కేసీఆర్ పేరును ఆమె తన చేతికి పచ్చబొట్టుగా వేయించుకున్నారు. గిరిజన యోధుడు కొమురంభీమ్ సహచరుని వారసులు ఆ పచ్చబొట్టు వేయడం విశేషం. జూన్ 2 నుంచి జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని బంజారాభవన్‌లో నిర్వహించిన గిరిజన సంస్కృతి ఉత్సవాల్లో మంత్రి సత్యవతి…

APTELANGANA

నిర్మలా సీతారామన్ అల్లుడు ఏం చేస్తారో తెలుసా?

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌(Niramala Sitharaman), పరకాల ప్రభాకర్‌ దంపతుల కుమార్తె వాజ్ఞ్మయి(Vangmayi) వివాహం ప్రతీక్‌(Pratik Doshi)తో నిరాడంబరంగా జరిగింది. స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో బెంగళూరులోని మంత్రి ఇంట్లోనే పెళ్లి వేడుక పూర్తిచేశారు. రాజకీయ ప్రముఖులు, వీవీఐపీలు ఎవరూ హాజరుకాలేదు. పెళ్లి సమాచారాన్ని సీతారామన్‌ కుటుంబసభ్యులు అధికారికంగా బయటకి వెల్లడించలేదు. అయితే వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిర్మలా సీతారామన్‌ అల్లుడు ప్రతీక్‌ వివరాల కోసం నెటిజన్లు గూగుల్‌లో…

APTELANGANA

వైసీపీలోకి ముద్రగడ చేరిక లాంఛనమేనా ? కాకినాడ ఎంపీగా పోటీపై చర్చలు !

కాపు ఉద్యమాలతో తెరపైకి వచ్చిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గత టీడీపీ ప్రభుత్వంలో తుని రైలు దహనం ఘటనతో చర్చల్లోకి వచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఆయన్ను టార్గెట్ చేయడంతో విపక్ష వైసీపీని ఆశ్రయించి మద్దతు పొందారు. ఇది కాస్తా ఎన్నికల్లో సైతం వైసీపీకి అనుకూలంగా పనిచేసింది. దీంతో గోదావరి జిల్లాల్లో వైసీపీ మెజారిటీ సీట్లను గెల్చుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మౌనంగా ఉంటున్న ముద్రగడ తాజాగా కీలక ప్రకటన చేశారు.…