`భవిష్యత్తు గ్యారెంటీ`- టీడీపీ మేనిఫెస్టో: ఆరు హామీలను ఆవిష్కరించిన చంద్రబాబు
రాజమండ్రి వేదికగా.. తెలుగుదేశం పార్టీ మహానాడును జరుపుకొంటోంది. ఇవ్వాళ రెండో రోజు. పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శతజయంతి కూడా తోడుకావడంతో ఇవ్వాళ్టి కార్యక్రమాలను మరింత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. పలు కీలక తీర్మానాలను ఆమోదించనుంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ సాయంత్రం తన ముగింపు సభలో పలు కీలక అంశాలను ప్రకటించే అవకాశం ఉంది. ఎన్టీ రామారావు శతజయంత్యుత్సవాలను పురస్కరించుకుని చంద్రబాబు- తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా బహిరంగ లేఖ…

